చంద్ర‌బాబు బిగ్ స్కెచ్.. అక్క‌డ సైకిల్ జోరుకు బ్రేకుల్లేవ్‌…!

రాయలసీమ అంటే అసలు డౌట్ లేకుండా వైసీపీ అడ్డా అనే పరిస్తితి. సీమలో వైసీపీ హవా స్పష్టంగా ఉంటుంది. రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉండటంతో ఇంతకాలం వైసీపీ హవానే నడిచింది. ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ..అంటే ఈస్ట్ లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉండగా, వెస్ట్ లో కడప-కర్నూలు-అనంతపురం జిల్లాలు ఉన్నాయి. అయితే గత రెండు ఎన్నికల్లో ఈస్ట్, వెస్ట్ సీమల్లో వైసీపీదే హవా.

2014 ఎన్నికల్లో ఒక్క అనంతపురం మినహా మిగిలిన అన్నీ జిల్లాల్లో వైసీపీదే లీడ్. ఇక 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు. అన్నీ జిల్లాల్లో వైసీపీ హవానే. ఇక కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్వీప్ చేసేసింది. అంటే వైసీపీ హవా ఏ స్థాయిలో నడిచిందో చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పుడు కూడా అదే పరిస్తితి ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఈస్ట్, వెస్ట్ లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది.

టి‌డి‌పి బలం పెంచేలా చంద్రబాబు అదిరిపోయే స్కెచ్ లతో ముందుకెళ్లారు. మొదట నాయకులని యాక్టివ్ చేశారు. ప్రతి నాయకుడుకు దిశానిర్దేశం చేసి..ప్రజల్లో ఉండేలా, వైసీపీపై పోరాటం చేసేలా చేశారు. దీంతో పార్టీ బలం పెరిగింది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, వైసీపీలో గ్రూపు తగాదాలు టి‌డి‌పికి కలిసొస్తున్నాయి.

ఇక చంద్రబాబు సైతం మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈస్ట్, వెస్ట్ సీమ జిల్లాల్లో ఎక్కువ పర్యటించారు. తన సొంత స్థానం కుప్పంకే పలుమార్లు వచ్చారు. ఇలా ఎక్కువ ఫోకస్ చేసి పార్టీని బలోపేతం చేశారు. ఇప్పుడు సీన్ దెబ్బకు మారింది. ఈస్ట్ సీమలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టి‌డి‌పి లీడ్ వచ్చేలా చేశారు. అటు వెస్ట్ లో అనంత, కర్నూలు జిల్లాల్లో టి‌డి‌పి హవా పెరిగింది. కడప, చిత్తూరుల్లో ఇంకాస్త బలం పెరగాలి. మొత్తానికి ఈ సారి సీమలో టి‌డి‌పి సత్తా చాటేలా ఉంది.

Tags: AP, ap politics, chandrababu, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, YS Jagan