జేసీ వారసులు ఇద్ద‌రు 2024లో టాప్ లేపే రికార్డు కొడుతున్నారా..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి..ఈ ఇద్దరు బ్రదర్స్ దశబ్దాల కాలం నుంచి జిల్లా రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అనేక ఏళ్ళు పనిచేశారు. 2014లో టి‌డి‌పిలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓటమి ఎరగని జేసీ బ్రదర్స్‌కు గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. తమ తనయులు పోటీ చేసి ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు.

JC ASHMIT REDDY (@ashmitjc) / Twitter

అసలు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఓటమి అంటే తెలియదు..అలాంటిది అక్కడే జేసీ ఫ్యామిలీకి ఎదురుదెబ్బ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అటు అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇలా ఇద్దరి వారసులు ఓటమి పాలయ్యారు. కానీ ఇప్పుడు ఇద్దరు వారసులని గెలిపించుకునే దిశగా జేసీ బ్రదర్స్ పనిచేస్తున్నారు.

ఇప్పటికే తాడిపత్రిలో తమ బలాన్ని పెంచుకున్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకుని..మున్సిపల్ ఛైర్మన్ కూడా అయ్యారు. అయితే నెక్స్ట్ తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం వచ్చింది. కానీ ఆయన మున్సిపల్ ఛైర్మన్ గా ఉంటూనే..తన తనయుడు అస్మిత్ రెడ్డిని తాడిపత్రి బరిలో దింపడానికి రెడీ అయ్యారు.

Why JC Pavan Reddy Maintain Distance To TDP Leaders And Programs | JC Pavan  Reddy: అనంత టీడీపీలో ఏం జరుగుతోంది.. జేసీ పవన్ రెడ్డి పార్టీకి ఎందుకు  దూరంగా ఉంటున్నారు?

తాజాగా నారా లోకేష్ పాదయాత్ర తాడిపత్రిలో జరుగుతున్న విషయం తెలిసిందే. లోకేష్ సైతం..అస్మిత్‌ని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో అస్మిత్, అనంతలో పవన్ పోటీ చేయడం ఖాయమే..అలాగే వారికి గెలుపు అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈ సారి జే‌సి వారసులు ఇద్దరు తొలి విజయం.. అది కూడా రికార్డు విజ‌యం అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp