బిగ్ బ్రేకింగ్: రష్మిక ఎంగేజ్ మెంట్ అయిపోయిందోచ్.. రింగ్ తో అభిమానులకు గుడ్ న్యూస్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే కచ్చితంగా అది నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండల మధ్య ప్రేమాయణం అనే చెప్పాలి . వీళ్లిద్దరూ కలిసి గీత గోవిందం అనే సినిమాతో స్క్రీన్ పై మెరిసారు . ఈ సినిమాల్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది . అంతేకాదు తెరపై ఫస్ట్ టైం నటిస్తున్న సరే ఏ మాత్రం మొహమాటం అనేది లేకుండా రెచ్చిపోయి నటించారు ఈ జంట . ఈ క్రమంలోనే ఈ జంట పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది.

Rashmika -Vijay Devarakonda bride-groom pics amid dating rumors???

అంతేనా ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ జంట పేరు ఓ రేంజ్ లో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆ తర్వాత కూడా రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ కలిసి బయట ఎక్కువగా కనిపించడం సినిమాలోనే కాకుండా బయట కూడా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండడంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి . అంతేకాదు రష్మిక మందన ఎక్కడికి వెళ్లితే అక్కడ విజయ్ దేవరకొండ ఉండడం రష్మిక నటించిన సినిమాలకు చీఫ్ గెస్ట్ గా ఈవెంట్లకు అటెండ్ అవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది .

ఈ క్రమంలోనే విజయ్ – రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సినీ ప్రముఖుల సైతం అభిప్రాయపడ్డారు . ఆ వార్తలు నిజం చేస్తూ పరోక్షకంగా హింట్ ఇచ్చింది రష్మిక. దానికి ప్రూఫ్ చెబుతూ రష్మిక మందన్నా తన పుట్టినరోజు నాడు విజయ్ ఇచ్చిన ఉంగరాన్ని ధరించింది. విజయ్ దేవరకొండకు ఎంతో ఫేవరెట్ అయిన ఉంగరాన్ని రష్మిక ధరించడం ఈ పిక్స్ లో కనిపిస్తుంది .

అంతేకాదు రష్మిక మందన విజయ్ దేవరకొండ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు అని.. వాళ్ళు పోస్ట్ చేసిన పిక్స్ ఆధారంగా క్లియర్ గా అర్థమవుతుంది . దీంతో వీళ్ళ నిశ్చితారధం అయిపోయిందని.. అందుకే ఒక్కే రూమ్ లో ఉంటున్నారని.. త్వరలోనే రష్మిక మందన – విజయ్ దేవరకొండ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు . అంతేకాదు ఈ జంట త్వరలోనే మరో సినిమాలో కూడా కలిసి నటించబోతున్నారు అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటే ఇండస్ట్రీలో సంతోషించే జనాలు చాలా ఎక్కువ గా మంది ఉన్నారు అనేది మాత్రం వాస్తవం…!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Rashmika Mandanna, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, Vijay Devarakonda, viral news