వావ్‌: త్రివిక్రమ్ భార్య సౌజన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా…!

ఇండస్ట్రీలోకి వచ్చి ఛాన్సులను దక్కించుకోవడం చాలా కష్టం. అలాంటిది ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి క‌ష్టప‌డి ఎదిగిన వారిలో త్రివిక్రమ్ ఒకరు. ఆయన ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్. త్రివిక్ర‌మ్‌ డైలాగ్స్ కు ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అయితే త్రివిక్రమ్ భార్య సౌజన్య టాలెంట్ గురించి చాలా మందికి తెలియ‌దు. ఆమె ఒక నృత్య కళాకారుని. సౌజన్య చాలా కష్టపడి కుటుంబాన్ని చూసుకుంటూ కూడా డాన్స్ క్లాస్ కు వెళుతూ నాట్యం నేర్చుకున్నారు.

భార్య ఇష్టాన్ని గౌరవించి త్రివిక్రమ్ చాలా సపోర్ట్ చేసేవారు. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకొని ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది సౌజ‌న్య‌. త్రివిక్రమ్ ఆమె ఇచ్చే ప్రదర్శనలు అన్నింటిలోనూ పాల్గొంటారు. ఇటీవల సౌజన్య రవీంద్ర భారతిలో ఇచ్చిన నాట్య ప్రదర్శనకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా రావడంతో ఆ డాన్స్ షో పైన అందరి ఫోకస్ పడింది.

ఇటీవ‌ల ఆమె ఇంట‌ర్వ్యూలు హైలెట్ అవుతున్నాయి. ఆమె చిన్న‌ప్ప‌టి నుంచే కళాత‌పస్వి కె. విశ్వనాథ్ సినిమాలను చూసేద‌ట‌. ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితోనే నాట్యం పైన కూడా ఇంట్రెస్ట్ వచ్చిందట‌. ఆమె పుట్టింది పెరిగింది అంతా వైజాగ్ లోనే. సౌజన్య ప్రముఖ సాంగ్ రైటర్ సిరివెన్నెల సీతా సీతారామశాస్త్రి తమ్ముడు కూతురు. అయితే సౌజన్యకు మొదటి నుంచి తన పెదనాన్నతో చనువు ఎక్కువగా ఉండేదట.

Trivikram wife: త్రివిక్రమ్ వైఫ్ గురించి మీకు తెలియని విషయం !! | NewsOrbit

సీతారామశాస్త్రి సౌజన్య పదవ తరగతిలో ఉన్న‌ప్పుడే హైదరాబాద్ వచ్చేసారు. సెలవుల్లో పెదనాన్న ఇంటికి వచ్చేద‌ట‌ సౌజన్య. త‌ర్వాత‌ మా కుటుంబంతో స‌హా హైదరాబాద్ కు వచ్చి సెటిలైపొయమని,. అందరం కలిసే ఉండే వాళ్ళమని సౌజన్య చెప్పారు. ప్రస్తుతం సౌజన్య నిర్మాత‌గా కూడా సినిమాలు నిర్మిస్తోంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, star director, telugu news, thrivikram, Tollywood, tollywood news, trendy news, viral news