‘ భోళాశంక‌ర్ ‘ ట్రైల‌ర్‌.. పాత చింత‌కాయ ప‌చ్చ‌డే.. ఊర‌మాస్ ( వీడియో )

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతోన్న సినిమా భోళాశంక‌ర్‌. కోలీవుడ్‌లో ఎప్పుడో ఐదారేళ్ల క్రితం హిట్ అయిన అజిత్ వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ భోళాశంక‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది. ప్లాపు సినిమాల‌తో అడ్ర‌స్ లేకుండా పోయిన మెహ‌ర్ ర‌మేష్‌కు చిరంజీవి ఏరి కోరి ఈ సినిమా ఛాన్స్ ఇచ్చారు. కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా న‌టిస్తుండ‌డంతో పాటు మిల్కీబ్యూటీ త‌మ‌న్నా చిరుకు జోడీగా న‌టిస్తుండ‌డంతో ఈ సినిమా ఏదైనా సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుందా ? అన్న ఆశ‌లు అయితే ఉన్నాయి.

తాజాగా ఈ రోజు భోళాశంక‌ర్ సినిమా ట్రైల‌ర్‌ను మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ రిలీజ్ చేశారు. ముందుగా కోల్‌కోత్తాలో చిన్న పిల్ల‌ల మిస్సింగ్‌తో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత రొటీన్‌గానే చెల్లి సెంటిమెంట్‌.. విల‌న్ ఒక‌డు.. వాడిపైన మ‌రో విల‌న్‌తో సినిమా న‌డుస్తుంటుంది. పెద్ద‌గా ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు లేవు. త‌మ‌న్నా మాత్రం రామ్‌చ‌ర‌ణ్‌కు బాబులా ఉన్నాడ్రా బాబు అని చిరును మ‌ద్దుగా పిలుచుకోవ‌డం బాగుంది.

శ్రీముఖి, చిరు మ‌ధ్య వ‌చ్చే సీన్లు బాగున్నాయి. భోళాజీ అని శ్రీముఖి అంటే.. భోలోజీ అని చిరు ఆమెను ఆట‌ప‌ట్టించ‌డం.. చ‌క్క‌గా రొమాంటిక్‌గా ఉంది. విల‌న్లు, రొటీన్ డైలాగులు అంతా రొటీన్ వ్య‌వ‌హారమే అన్న‌ట్టుగా ఉంది. క‌థ‌, క‌థ‌నాల్లో పెద్ద మెరుపులు, మ్యాజిక్‌లు అయితే లేవు. మ‌రి రేపు ఈ రొటీన్ కంటెంట్‌తో చిరు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడ‌న్న దానిమీదే ఈ సినిమా విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది.