బాల‌య్య ‘ అన్ స్టాపబుల్ 3 ‘ స్టార్ట్ అప్పుడే… ఈ సారి ఊహించ‌ని మార్పులు…!

నందమూరి నట‌సింహం బాలయ్య తొలిసారిగా బుల్లితెరపై హోస్ట్ చేసిన టాక్ షో అన్‌స్టాప‌బుల్ షో. ఆహా ఓటీటీలో ప్రసారమైన ఈ షో ఎలాంటి ? రికార్డులు నెలకొల్పిందో చూసాం. అప్పటివరకు బుల్లితెరపై ఉన్న టిఆర్పి రికార్డులు బ్రేక్ చేస్తూ అన్‌స్టాప‌బుల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అన్నిటికంటా గొప్ప విషయం ఏంటంటే అసలు బాలయ్యను ఇంత ఎనర్జీతో.. ఈ స్టైల్ లో చూస్తాం అని బాలయ్య అభిమానులు ఎప్పుడు ఊహించని రేంజ్ లో బాలయ్య విశ్వరూపం చూపించేశారు.

అన్‌స్టాప‌బుల్ షో ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లు పూర్తిచేసుకుంది. ఈ రెండు సీజ‌న్లు కూడా తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు బాలయ్యకి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ అన్‌స్టాప‌బుల్ సీజన్ 3 వాయిదా పడుతూ వస్తోంది. ఇక త్వరలోనే ఈ షో స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. నవంబర్ మొదటివారంలో లేదా మూడో వారంలో అన్ స్టాప‌బుల్‌ 3 ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలోని ఈ షోకు సంబంధించిన వారి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ షోను ఈసారి సరికొత్తగా డిజైన్ చేయబోతున్నారట. సీజన్ 3 లో పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా వచ్చేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. అసలు ఇప్పటివరకు తెరపై కనిపించకుండా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని స్టార్స్ ని కూడా ఈ షోలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

అలాగే సీనియర్ నటీమణులు.. టాలీవుడ్ కుర్ర హీరోలు కూడా ఈ షోలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సారి కూడా నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఆహా ఓటీటీ దద్దరిల్లేలా చేయడం హోస్ట్ చేయ‌డం ఖాయంగా కనిపిస్తోంది.