మా అమ్మకి, మా అత్తకి పడేది కాదు… గొడ‌వ‌లకు కార‌ణం చెప్పిన రాజీవ్ క‌న‌కాల..!

టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బుల్లితెరపై కూడా అందరికీ సుపరిచితమే. సుమ – రాజీవ్ కనకాల ఓ సీరియల్ షూటింగ్ టైంలో కలిసి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరిద్దరి వివాహానికి మొదట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా తరువాత అంగీకరించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. గతంలో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నార‌న్న వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికీ ఆ వార్త అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది.

ఇక రాజీవ్ కనకాల ఓ సందర్భంలో మాట్లాడుతూ మా కెరీర్‌ గురించి.. మా విడాకుల గురించి పదేపదే రాయడం మాట్లాడడం మీడియాకి అలవాటైపోయిందని సోషల్ మీడియాను విమర్శించాడు. సుమ‌ ఎంతగానో కష్టపడి పనిచేస్తుందని ఆమెకి కెరీర్ తో పాటు కుటుంబం కూడా ఎంతో ముఖ్యమని.. తాను ఎక్కడ ఉన్న పిల్లలపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూనే ఉంటుందని.. పిల్ల‌ల బాగోగులు ఆమె చూసుకుంటుందని చెప్పాడు.

అందరి కుటుంబంలానే మా కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయని.. చిన్ని చిన్ని గొడవలు జరుగుతూ ఉంటాయని.. కానీ మేము ఎప్పుడూ విడాకుల వరకు వెళ్లలేదని సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ అవాస్తవాలంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్ని సమస్యలు వచ్చినా మేము అంతగా పట్టించుకోము కానీ సుమ తల్లి, మా తల్లిదండ్రులు కూడా ఒకే అపార్ట్మెంట్లో వేరువేరు ప్లాట్లు ఉండే వాళ్ళమని.. మా అమ్మ బ‌తికి ఉన్నప్పుడు సుమ తల్లికి మా అమ్మకు మధ్య ఎప్పుడు చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉండేవ‌న్నాడు.

ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేసుకునేవాళ్ల‌మ‌ని.. కానీ అవి మేము పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. అది కూడా పిల్లల విషయంలోనే వచ్చేవని రాజీవ్ స్పష్టంగా వివరించాడు. అమ్మ పోయాక ప్రస్తుతం ఆ విషయాలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదని.. ప్రతి భార్య భర్త ఎలా ఉంటారో మేము అలాగే ఉంటున్నామని వివరించాడు.