బాల‌య్య రాజ‌కీయం మారుతోందా…. 2024లో సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌బోతున్నాడా…!

ప్రముఖ సిని నటుడు, టీడిపి కీలక నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇక ఫుల్ టైం పాలిటిక్స్ చేయబోతున్నారా ? వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయంగా మరింత యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారా ? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అంటున్నారు టీడిపి నాయకులు. బాలయ్య గత రెండు ఎన్నికలలోను తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నియోజకవర్గంలో నుంచి వరుస విజయాలు సాధించారు. విచిత్రం ఏమిటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల కంటే.. గత ఎన్నికలలోనే బాలయ్యకు హిందూపురంలో ఎక్కువ మెజార్టీ వచ్చింది.

nandamuri balakrishna, Balakrishna Corona Positive: బాలకృష్ణకు కరోనా  నిర్ధారణ.. టీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్! - tdp mla nandamuri balakrishna  tests positive for covid 19, recently he meets telangana health ...

2019లో గెలిచాక ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి ఆ తర్వాత చాలా తక్కువ సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కరోనా తర్వాత కూడా బాలయ్య వరుసగా సినిమా షూటింగులతో బిజీబిజీగా గడిపేశారు. అయితే తాజా అసెంబ్లీ సమావేశాలకు బాలయ్య హాజరయ్యారు. టీడిపి నేతలతో కలిసి ఆందోళనలోనూ పాల్గొన్నారు. అలాగే బాలయ్య మాట్లాడుతూ వైసిపి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాలయ్య కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఫ్ల‌కార్థులు పట్టుకుని పాదయాత్ర చేశారు.

TDP third list released | Top Stories

అలాగే నరసరావుపేటలో తన అభిమాని తన సినిమా పాటలకు డ్యాన్స్ చేశారని… నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆ యువకుడిని ఇబ్బంది పెట్టటం.. అతడు ఆత్మహత్యాయత్నం చేయటం తెలిసిందే. దీంతో బాలయ్య నేరుగానే శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. వైసిపి నాయకులు కూడా బాలయ్యకు ఈ విషయంలో ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే బాలయ్య ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా సొంత నియోజకవర్గం హిందూపురంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించండి: ఎమ్మెల్సీ ఇక్బాల్ | Declare  Hindupur as the district headquarters mlc Iqbal vvr-MRGS-AndhraPradesh

ముఖ్యంగా కరోనా సమయంలోను.. ఆ తర్వాత బాలయ్య పార్టీలకు, వర్గాలకు, కులాలకు అతీతంగా చేసిన సేవలు ఆయన అక్కడ రాజకీయంగా మరింత స్ట్రాంగ్ అవటానికి కారణం అయ్యాయి. ఇటీవల కాలంలో హిందూపురంలో తరచూ పర్యటిస్తూ తన సొంత నిధులతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల నిధులతో కూడా కొన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు. ఏదేమైనా వచ్చే ఎన్నికలలోను బాలయ్య గత రెండు ఎన్నికల కంటే మరింత భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.

POSTERMALL TDP Party Logo sl340 (Wall Poster, 13x19 Inches, Matte Paper,  Multicolor) : Amazon.in: Home & Kitchen

తక్కువలో తక్కువగా ఈసారి బాలయ్య మెజార్టీ 25 వేలకు పైనే ఉంటుందని స్థానికంగా అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. బాలయ్యకు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే హిందూపురం నియోజకవర్గంలో వైసీపీలో 3 – 4 గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూపుకు టికెట్ ఇచ్చినా.. మరో గ్రూపు సహకరించే పరిస్థితి లేదు. ఇవన్నీ వర్క్ అవుట్ అయితే బాలయ్య ఈసారి హిందూపురంలో గట్టిగా విక్టరీ కొట్టేసేలా ఉన్నాడు.

Tags: AP, ap politics, intresting news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp