సెంటిమెంట్‌కే చంద్ర‌బాబు ఓటు… ఈ సారి ఆమె ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప‌క్కా..!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత రెండు ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ ఓడిపోతున్న నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు కూడా ఒకటి..చాలా తక్కువ మెజారిటీలతో టి‌డి‌పి ఓడిపోతూ వస్తుంది. గెలుపు దగ్గర వరకు వచ్చి బోల్తా కొడుతుంది. బై లక్ వైసీపీకి గెలుపు దక్కుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో కేవలం 3 వేల పై చిలుకు ఓట్ల తోనే ప్రత్తిపాడులో వైసీపీ గెలవగా, 2019 ఎన్నికల్లో 4 వేల పై చిలుకు ఓట్లతో వైసీపీ గెలిచింది.

Andhra Pradesh: TDP Chief Chandrababu Naidu Gets Centre's Invite For  Crucial Meet

అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి గెలుపు ఛాన్స్ ఉందా? అంటే అబ్బే అలాంటిదేమీ కనిపించడం లేదు. వరుసగా గెలిచిన సరే..అధికారంలో ఉన్నా సరే ప్రత్తిపాడుకు వైసీపీ చేసిందేమి లేదు. దీంతో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల సర్వేల్లో కూడా ప్రత్తిపాడులో టి‌డి‌పి గెలుపు ఖాయమని తేలింది. అయితే టి‌డి‌పి బలపడటానికి కారణం వరుపుల రాజా..ఆయన ప్రత్తిపాడులో టి‌డి‌పిని బలోపేతం చేయడంలో బాగా కష్టపడ్డారు.

టిడిపి నేత వ‌రుపుల రాజా గుండెపోటుతో క‌న్నుమూత‌.. | Prabha News

గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా సరే..కొన్ని రోజులు పార్టీకి దూరమైన సరే మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యి..నిరంతరం పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. అధికార వైసీపీకి ధీటుగా పనిచేశారు. దీంతో ప్రత్తిపాడులో టి‌డి‌పి ఆధిక్యంలోకి వచ్చింది..ఇక నెక్స్ట్ ఆయన నిలబడటం గెలవడం సులువు అనే తరుణంలో..రాజా అనూహ్యంగా గుండెపోటుతో మరణించడం టి‌డి‌పికి లోటుగా మిగిలింది.

అయితే ఆ లోటుని భర్తీ చేసేందుకు తాజాగా రాజా భార్య సత్యప్రభని ప్రత్తిపాడు ఇంచార్జ్ గా నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు..ప్రత్తిపాడు ఇంచార్జ్ పదవి సత్యప్రభకు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో సత్యప్రభ ప్రత్తిపాడులో పోటీ చేయడం ఖాయమైంది. ఇప్పటికే టి‌డి‌పి బలం ఉంది..అటు సానుభూతి కూడా ఉంది. దీంతో ప్రత్తిపాడులో టి‌డి‌పి గెలుపు పక్కా అని చెప్పవచ్చు.

Tags: AP, ap politics, chandra babu, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp