సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలో బాల‌కృష్ణ‌… ఆ ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో ఉన్న‌ బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఒక క్రేజీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే 108 అనే టైటిల్ తో ఈ సినిమా పోస్టర్స్ రిలీజై ఇప్పటికే అభిమానుల్లో మ‌రింత‌ ఆసక్తి పెంచాయి. వ‌రుస‌ హిట్ సినిమాలను సొంతం చేసుకున్నత‌ర్వాత బాలయ్య నటించబోయే సినిమా కావ‌డంతో భారీ అంచనాలు ఉన్నాయి.

కాక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, పోస్టర్ లేదా వీడియోలు రిలీజ్ చేయబోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా ఒక పోస్ట్ ద్వారా తెలిపారు ఎన్బీకే 108 మూవీ మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకముందే మ‌రెన్నో సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బాలయ్య. దీనిలో భాగంగానే ప్రస్తుతం బాలయ్య వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబితో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారట‌.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించే ఈ సినిమా బాబీ – బాలయ్య కాంబినేషన్లో రావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు. ఇప్పటివ‌ర‌కు ఈ ప్రాజెక్ట్‌పై అధికార ప్రకటన రాలేదు. బాలయ్య‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తార‌ట‌.

Balakrishna HQ Wallpapers | Balakrishna Wallpapers - 21364 - Oneindia  Wallpapers

ఈ క్రేజీ ప్రాజెక్టుపై మరో ఆసక్తికరమైన వార్త కూడా బయటకు వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైనే బాబి – రజనీకాంత్ సినిమా చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక కథను రాసిన బాబీ రజనీకాంత్ కు వినిపించగా రజనీకాంత్ కి అంతగా ఆ స్టోరి న‌చ్చ‌లేదు. పైగా ర‌జ‌నీ లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. బాబీ ఇదే స్టోరీ బాలయ్య‌కి వినిపించగా సింగిల్ సిటింగ్ లోనే సినిమాకు ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి.

రజనీకాంత్ కోసం ఆయనకు తగ్గట్టుగా స్టోరీ రాసిన బాబీ బాలయ్యకు అనుగుణంగా క‌థ‌లో చిన్న చిన్న మార్పులు కూడా చేశాడ‌ట‌. అలా సూపర్ స్టార్ రజనీకాంత్ చేయాల్సిన సినిమాలో బాలకృష్ణ వచ్చి చేరాడు.