వేల కోట్ల ఆస్తికి అధిప‌తి అయిన ఈ చిన్నారి… టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా ?

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా త్రో బ్యాక్ థీంతో నటీనటుల ఫొటోల‌తో పాటు నటుల కుటుంబంలో ఫేమస్ ఫిగర్స్ గా నిలిచిన వారి ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే పై ఫొటోలో బూరె లాంటి బుగ్గలతో క్యూట్‌గా ఉన్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ? వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన ఈ అమ్మాయి అంత ఆస్తి ఉన్నా సరే ఏమాత్రం గర్వం లేకుండా చాలా అణుకువగా ఉంటుంది.

ప్రస్తుతం టాప్ బిజినెస్ ఉమెన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నారి స్త్రీ జాతి గర్వపడేలా సత్తాను చాటుకుంది. ఇక టాప్ బిజినెస్ ఉమెన్‌గా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఒక స్టార్ హీరోకి భార్యగా, ప్రెగ్నెంట్ గా ఉన్న ఈమె త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివబోతుంది. ఈమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా ? ఆమె ఎవ‌రో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.

Ram Charan-Upasana escape to Africa to celebrate their seventh wedding  anniversary | Events Movie News - Times of India

ఇంత చిన్న వ‌య‌స్సులోనే అపోలో హాస్పిటల్స్ గ్రూప్స్‌కు చైర్పర్సన్‌గా ఉపాస‌న ఉన్నారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాసన కొణిదెల – రామ్ చరణ్‌ను పెళ్లి చేసుకుని పది సంవత్సరాలైంది. ఉపాసన కెరియర్‌లో పూర్తిగా సెటిల్ అయిన తరువాత పిల్లల్ని కనాల‌ని నిశ్చయించుకోవ‌డంతో ఆమె ఆలోచనను గౌరవిస్తూ రామ్ చరణ్ కూడా దాదాపు పదేళ్ళ పాటు భార్య చెప్పినట్లుగానే నడుచుకున్నాడు.

Upasana says Ram Charan was 'physically shaking' during RRR's Naatu Naatu  shoot | Bollywood - Hindustan Times

చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉండే ఈ జంట ప్రస్తుతం కాబోయే తల్లిదండ్రులుగా పేరెంట్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఉపాసన ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన తర్వాత మెగా ఫ్యామిలీ కంటే ఎక్కువగా రామ్ చరణ్ ఫాన్స్, మెగా ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఉపాసన ఆగస్టు లేదా సెప్టెంబర్ లో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందట