అన‌సూయ‌ను పెళ్లి ఫొటోల్లో చూశారా….ఆ త‌ప్పు చేసి ఉండ‌క‌పోతే నిజంగా స్టార్ హీరోయినే…!

జబర్దస్త్ యాంకర్ అనసూయ నిన్న మొన్నటి వరకు గ్లామర్ టచ్ ఆస్తూ సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా కొనసాగారు. అనసూయ యాంకరింగ్ లోనే కాక యాక్టింగ్ ఫీల్డ్‌లో కూడా సత్తా చాటుకుంది. వెండితెరపై తన అందచందాలతో, పెర్ఫామెన్స్ తో.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన అనసూయ వెండి తెరపై ఫేమస్ కావడంతో బుల్లితెరని పక్కన పెట్టేసింది. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ రోల్స్ చేయకపోయినా, పర్ఫామెన్స్ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా అదరగొడుతుంది.

రంగస్థలం, పుష్ప లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కీ రోల్ పోషించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తోంది. ఏమాత్రం సమయం దొరికినా సరే ఫ్యామిలీతో స్పెండ్ చేసే అనసూయ ఇటీవలే బ్యాంకాక్ వెళ్లి భర్తతో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో వెకేషన్‌లో భ‌ర్తతో దిగిన కొన్ని హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ హాట్ ఫొటోస్ పిచ్చ‌పిచ్చ‌గా వైర‌ల్ అవుతున్నాయి.

వెకేష‌న్‌లోనే అనసూయ – సుశాంక్ పెళ్లిరోజు ఎంజాయ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పెళ్లినాటి ఫొటోలు షేర్ చేసింది. పెళ్లి ఫోటోలు చూసిన వారంతా అనసూయ అందానికి ఫిదా అవుతున్నారు. అప్పట్లో చూడడానికి స్టార్ హీరోయిన్ లా, రొమాంటిక్ గా ఉన్న అనసూయ ప్రేమించిన వాడిని ప‌ట్టుబట్టి మ‌రీ పెళ్లి చేసుకుంది.

అనసూయ – సుశాంక్ ప్రేమకి పెద్దలు అంగీకరించలేదు. అనసూయ తండ్రి సుశాంక్ ని అల్లుడిగా అసలు ఇష్టపడలేదు. ఆ టైంలో పెద్దలను ఎదిరించి మ‌రీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది అనసూయ. అదే సమయంలో అనసూయకు ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీ రోల్ ప్లే చేసే అవకాశం వచ్చిందట.

అంత అందంగా ఉన్న.. అనసూయ అదే టైంలో ఆ రోల్‌తో పాటు కంటిన్యూ అయితే త‌ర్వాత టాలీవుడ్‌లో ఆ త‌ర్వాత కాలంలో అయినా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునేద‌ని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అనసూయ చేసిన ఆ చిన్ని తప్పుల వల్లే ప్రస్తుతం ఆమె క్యారెక్ట‌ర్ అర్టిస్ట్‌గా మిగిలిపోయింది.