పరిటాల ఫ్యామిలీ ఫేట్ మార్చిన లోకేష్.. అదొక్కటే డౌట్.. !

లోకేష్ పాదయాత్ర ప్రభావం వల్ల టి‌డి‌పికి ప్లస్ అవుతుందా ? అంటే ఖచ్చితంగా అవుతుందనే చెప్పాలి. ఆయన పాదయాత్ర మొదట్లో అంతగా ప్రభావం మాత్రం చూపలేదు. కొన్ని రోజుల పాటు జనాల్లో పాదయాత్ర గురించి చర్చ జరగలేదు. కానీ నిదానంగా పాదయాత్రకు ఊపు వచ్చింది. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న విధానం ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరినీ దగ్గర చేసుకుంటున్నారు.

Andhra Pradesh: 'Yes I am a rowdy' .. Paritala Shriram made sensational comments .. | Tdp Leader Paritala Sri Ram Sensational Comments on Political Conflict - PiPa News

సమస్యలని తెలుసుకుంటున్నారు..ముఖ్యంగా యువతని ఆకట్టుకుంటున్నారు. ఇలా అన్నీ రకాలుగా లోకేష్ పాదయాత్ర టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పి బలోపేతానికి లోకేష్ పాదయాత్ర కూడా హెల్ప్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన పాదయాత్ర అనంతపురంలో కొనసాగుతుంది. కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో సాగి..రాప్తాడు నుంచి ధర్మవరంలో విజయవంతంగా కొనసాగింది.

ఈ పాదయాత్ర జరిగిన నియోజకవర్గాల్లో టి‌డి‌పికి కాస్త ప్లస్ అవుతుంది. ఇదే క్రమంలో ఇటీవల సర్వేల్లో వెనుకబడిన పరిటాల ఫ్యామిలీకి లోకేష్ పాదయాత్ర చాలా హెల్ప్ అయిందని చెప్పవచ్చు. పరిటాల ఫ్యామిలీ చేతిలో రెండు నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. రాప్తాడు, ధర్మవరం స్థానాలు ఉన్నాయి. ఇటీవల సర్వేల్లో రెండుచోట్ల వైసీపీ గెలుపుకు అవకాశం ఉందని తేలింది.

నాకు మంత్రి పదవి కంటే కొడుకు ఎమ్మెల్యే కావడమే ముఖ్యం | Paritala Sunitha Wish To See Son Sriram as MLA– News18 Teluguమ్మెల్యే దీంతో పరిటాల అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే లోకేష్ ఎంట్రీతో ఆ సీన్ మారింది.. ఇప్పటికే రాప్తాడు ఎ ప్రకాష్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంద‌న్న చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు లోకేష్ పాదయాత్రతో అక్కడ టి‌డి‌పికి మరింత ఊపు వచ్చింది. ఇటు ధర్మవరంలో అదే పరిస్తితి. అలాగే రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించేశారు.

అయితే ఈ రెండు సీట్లలో రాప్తాడులో టి‌డి‌పి గెలుపు కాస్త సులువు అని చెప్పవచ్చు. కానీ ధర్మవరంలోనే కాస్త కష్టమవుతుందనే పరిస్తితి. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాస్త బలంగా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఏదైనా జరగొచ్చు. పరిటాల ఫ్యామిలీ ఇంకా కాస్త కష్టపడితే రెండు సీట్లని గెలుచుకోవడం ఖాయం.

Tags: AP, ap politics, chandrababu, intresting news, latest news, latest viral news, nara lokesh, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp