నంద‌మూరి ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే అప్‌డేట్‌.. బాల‌య్య – బోయ‌పాటి అఖండ 2 రిలీజ్ ఎప్పుడంటే..!

నంద‌మూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ నాలుగోసారి ఫిక్స్ అవ్వ‌డం ప‌క్కా. బాల‌య్య పుట్టిన రోజు నాడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది. ఆ సినిమా టైటిల్ కూడా వ‌చ్చేసింది అదే అఖండ సీక్వెల్ అఖండ 2. వీరిద్ద‌రి కాంబోలో యేడాదిన్న‌ర క్రింద‌ట వ‌చ్చిన అఖండ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్‌గానే అఖండ 2 సినిమా రాబోతోంది.

బోయ‌పాటి కూడా అఖండ 2 ఉంటుంద‌ని నాలుగు నెల‌ల క్రిత‌మే క్లారిటీ ఇచ్చేశారు. క‌రోనా టైంలో వ‌చ్చిన అఖండ మామూలు విజ‌యం సాధించ‌లేదు. 100 కు పైగా కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌డంతో పాటు డైరెక్టుగానే 4 కేంద్రాల్లో 100 రోజులు.. చిల‌క‌లూరిపేట‌లో డైరెక్టుగా 175 రోజులు ఆడి సెన్షేష‌న‌ల్ రికార్డు న‌మోదు చేసింది. ఇక అఖండ త‌ర్వాత వీర‌సింహారెడ్డి సినిమా చేసిన బాల‌య్య వెంట‌నే మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య త‌న 108వ సినిమాలో న‌టిస్తున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కాజ‌ల్ బాల‌య్య‌కు జోడీగా న‌టిస్తుంటే.. శ్రీలీల బాల‌య్య కుమార్తెగా న‌టిస్తోంది. ఇది పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య బోయ‌పాటి సినిమాను ప‌ట్టాలెక్కిం చేయ‌నున్నాడు. ఏపీలో వ‌చ్చే యేడాది ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే బాల‌య్య ఎన్నిక‌ల నేప‌థ్యం ఉన్న సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వీరి కాంబోలో వ‌చ్చిన లెజెండ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే చాలా మంది డైరెక్ట‌ర్లు త‌న కోసం క్యూలో ఉన్నా కూడా బాల‌య్య‌.. బోయ‌పాటితో పొలిటిక‌ల్ సినిమాయే తీయాల‌ని ఫిక్స్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. బాల‌య్య పుట్టిన రోజున ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కంటిన్యూగా షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చే మార్చికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ న‌డుస్తోంది. ఆగ‌స్టు నాటికి బోయపాటి తెరకెక్కిస్తోన్న రామ్ సినిమా షూటింగ్ కూడా పూర్తయిన వెంట‌నే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

Tags: balakrishna, balayya, Balayya Babu, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news