‘ రుద్రుడు ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… లారెన్స్ టార్గెట్ ఎంతంటే…!

సౌత్ ఇండియ‌న్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు రాఘవ లారెన్స్ హీరో గా నటించిన సినిమా రుద్రుడు. కాంచ‌న సీరిస్ సినిమాల‌తో తెలుగు నాట లారెన్స్ బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే లారెన్స్ సినిమాల‌కు త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ క్ర‌మంలోనే రుద్రుడు సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్‌కు మంచి క్రేజ్ వ‌చ్చేసింది. కంప్లీట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది.

రుద్రుడు సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌. శరత్ కుమార్ పూర్ణిమ భాగ్యరాజ్ నాజర్ కీలక పాత్రల్లో న‌టించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ ఇట్ ఈజ్ క్రియేటెడ్ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ వ‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ రు. 7 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి.

ఈ బిజినెస్ చూస్తుంటేనే తెలుగు రాష్ట్రాల్లోనే లారెన్స్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో తెలుస్తోంది. క‌దిరేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఉన్నారు. ఆంథోనీ ఎడిటర్ గా శివ-విక్కీ స్టంట్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాను తెలుగులో లారెన్స్‌కు స‌న్నిహితుడు అయిన నిర్మాత ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు.

రుద్రుడులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుందని… మాస్ యాక్షన్ డాన్స్ వంటి కమర్షియల్ అంశాలతో పాటు సెంటిమెంట్ కూడా అదిరిపోయేలా ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ క‌దిరేశ‌న్ చెప్పారు. ఇక స‌మంత శాకుంత‌లం సినిమాతో పోటీప‌డుతోన్న ఈ సినిమా ఏ రేంజ్‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో ? చూడాలి.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, ragava larence, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news