డిజాస్టర్ అని ముందే తెలిసినా మహేష్ చేసిన 2 సినిమాలు ఇవే..!

సినిమా చేసే ముందు ప్రస్తుత తరం హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి సినిమా ఫలితం ముందే తెలిసినా మౌనంగా సినిమా పూర్తి చేస్తారు. వారి అంచనాలకు తగ్గట్టే ఆ సినిమాలు సరైన ఫలితాన్ని సాధించవు. ఇదే అనుభవం మహేష్ బాబుకు కూడా ఎదురైంది. ఆయన తన కెరీర్‌లో ఇలా రెండు సినిమాలు డిజాస్టర్ అని ముందే తెలిసినా ఆ సినిమాలు పూర్తి చేశారు. కొందరిలా మధ్యలోనే మానేయకుండా ఏదైతే అది అయిందని ముందడుగు వేశారు.

ఇలా మహేష్ బాబు కెరీర్‌లో డిజాస్టర్‌గా మారిన రెండు సినిమాల గురించి తెలుసుకుందాం. తమిళనాడు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మురుగదాస్ ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆయన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఘన విజయాన్ని సాధించాయి. ఇలాంటి డైరెక్టర్‌తో స్పైడర్ అనే సినిమాను మహేష్ బాబు చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. సినిమా అంతా ఓకే అయినా, అది మహేష్ బాబుకు తగ్గ సినిమా కాదని ప్రేక్షకులు పెదవి విరిచారు.

అయితే ఈ సినిమా చేస్తుండగా మధ్యలోనే మహేష్ ఎక్కడో కొట్టిందట. సినిమా ఫలితం తేడాగా వస్తుందని ఆయన ముందే ఊహించారట. అయినా డైరెక్టర్ మురుగదాస్‌పై నమ్మకంతో సినిమా చేశారు. ధైర్యంగా సినిమా అపజయాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఇదే కాకుండా కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చక్కటి సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాలతో మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా చేశారు.

ఈ సినిమా చేస్తుండగా మహేష్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. సినిమా షూటింగ్ మధ్యలోనే స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాలేదనే విషయం ఆయన చెవిన పడింది. దీంతో డైరెక్టర్‌కు ఆయన చీవాట్లు పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాలని గట్టిగా చెప్పారట.

అప్పటికే ఈ సినిమా బోల్తా పడుతుందని ఆయన గ్రహించారు. అయినా బ్రహ్మోత్సవం చేశారు. అయితే ఇది కూడా ఆశించిన విజయం దక్కించుకోలేదు. ఇలా ఈ రెండు సినిమాల ఫలితాలు ముందే తెలిసినా వాటిని మహేష్ బాబు పూర్తి చేశారు.