Alia Bhatt : ఒక్క పోస్ట్ కోసం అలియా అంత తీసుకుంటుందా..?

Alia Bhatt

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటూ వస్తున్న అలియా భట్ (Alia Bhatt ) సినిమాలతో పాటుగా సోషల్ మీడియా ద్వారా కూడా ఆడియెన్స్ ని అలరిస్తుంది. అంతేకాదు తన సోషల్ మీడియా ప్రమోషన్స్ తో భారీగా సంపాదిస్తుంది అమ్మడు.

అలియా భట్ ఇన్ స్టాగ్రాం లో 68.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఆమె చేత సోషల్ మీడియా ప్రమోషన్స్ చేయిస్తుంటారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా అలియా భట్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో అలియా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తే అందుకు 80 లక్షల నుంచి కోటి దాకా తీసుకుంటుందట. ఒక్క పోస్ట్ కే అంత భారీ మొత్తమా అని అనుకోవచ్చు. అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ కి ఆ రేంజ్ తీసుకోవడంలో తప్పేమి లేదని చెప్పొచ్చు.

ఇక సినిమాల విషయానికి వస్తే అలియా భట్  (Alia Bhatt ) భర్త రణ్ బీర్ కపూర్ తోనే బ్రహ్మాస్త్ర సినిమా చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని మెప్పించింది అలియా భట్.

Tags: Alia, Alia Bhatt, Bollywood, Brahmastra, Brahmastra Movie, Ranbhir Kapoor, RRR