Priya Prakash : బాత్ టబ్ లో వింక్ బ్యూటీ.. మైకం కమ్మే చూపులతో..!

వింక్ బ్యూటీ మళయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash) ఒరు ఆదార్ లవ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా టీజర్ లో కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ క్రేజ్ ని ఛాన్సుల రూపంలో మలచుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. ఆ టీజర్ క్రేజ్ తోనే తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన ప్రియా ప్రకాశ్ అవి కూడా విఫలమవడంతో వెనకపడ్డది.

చేతిలో సినిమా ఛాన్సులు లేకపోయినా సరే ఫోటో షూట్స్ తో అమ్మడు ఆడియెన్స్ ని అలరిస్తుంది. హాట్ ఫోటో షూట్స్ తో తన ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాశ్ లేటెస్ట్ గా బాత్ టబ్ లో స్టిల్స్ తో సర్ ప్రైజ్ చేసింది. బ్లాక్ జెర్కీన్ తో బాత్ టబ్ లో ప్రియా ప్రకాశ్ (Priya Prakash) గ్లామర్ షో చేయకపోయినా తన ఓర చూపులతో ఆడియెన్స్ కి మైకం కమ్మేలా చేస్తుంది.

సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా తన సోషల్ మీడియా క్రేజ్ తో కాలం వెళ్లదీస్తుంది అమ్మడు. సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రియా ప్రకాశ్ కి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి. అమ్మడు మాత్రం ఎలాంటి పాత్ర వచ్చినా చేసేందుకు రెడీ అని సిగ్నల్స్ ఇస్తుంది.

Tags: Oru Aadhar Love, Priya Prakash, Priya Prakash Photoshoot, Priya Prakash Varrier, Wink Beauty