న్యూడ్ వీడియో నిజమో కాదో? అంత తొందరెందుకు? : మంత్రి రోజా రియాక్షన్

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం తెలుగురాష్ట్రాల్లోనే కాక.. జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశం అయ్యింది. ఇక ప్రతిపక్ష టీడీపీ.. ఎంపీ గోరంట్ల మాధవ్‌ను టార్గెట్ చేసింది. ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. ‘గోరంట్ల న్యూడ్ వీడియో నిజమో కాదో తెలియదు. ప్రస్తుతం ఈ వీడియోను ఫొరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించారు కదా.. మాది మహిళా పక్షపాత ప్రభుత్వం.. మహిళలను వేధించినట్టు తేలితే ఊరుకోం. వీడియోకు సంబంధించి ఫోరెన్సిన్ నివేదిక కోసం సీఎం వేచి చూస్తున్నారు.

కానీ తెలుగుదేశం నేతలు అప్పటి వరకు కూడా వెయిట్ చేయడం లేదు. వారి హయాంలో మహిళలపట్ల ఎటువంటి అన్యాయాలు జరిగాయో చూశాం. తెలుగుదేశం హయాంలో నారాయణ కళాశాలలో ఇటువంటి ఎన్నో ఘటనలు జరిగితే కప్పిపెట్టారు’ అంటూ రోజా రియాక్ట్ అయ్యారు. మొత్తంగా గోరంట్ల వ్యవహారం వైసీపీని కూడా ఆత్మరక్షణలో పడేసింది. ఇప్పటివరకు ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు, మంత్రులంతా గుంభనంగా ఉన్నారు. ఘటన జరిగిన రోజే సజ్జల మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తప్పు జరిగి ఉంటే కచ్చితంగా ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.

అయితే తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకొనేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి జగనే .. గోరంట్లను కాపాడుతున్నారని కూడా ఓ పత్రికలో కథనాలు రావడం గమనార్హం. అయితే సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఆయన వేచి చూస్తున్నారని టాక్. ఇక నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు, మంత్రులు నెమ్మదిగా నోరు విప్పుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ ఘటనపై మాట్లాడారు. తాజాగా రోజా స్పందించారు. ప్రభుత్వం మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags: gorantla madhav videos, mp gorantla madhav, RK Roja, YS Jagan, YSRCP MP Gorantla Madhav