‘ పొన్నియిన్ సెల్వన్ 2 ‘ రివ్యూ.. PS1తో పోల్చితే ఇంత పెద్ద హిట్టా…!

ప్రముఖ తమిల దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు అయిన పొన్నియిన్ సెల్వన్ గత ఏడాది రిలీజ్ అయ్యి సంచలన విజయం నమోదు చేసింది. గ‌త సెప్టెంబ‌ర్ 30న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఒక్క తమిళంలోనే ఈ సినిమాకు ఏకంగా రు. 400 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన రెండో భాగం పిఎస్ 2 ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. ఓవర్సీస్ ఆడియన్స్ టాక్ ప్రకారం పిఎస్ 2 సినిమాకు ఎలాంటి ట్యాక్‌ వచ్చింది ?పిఎస్ 1 తో పోలిస్తే ఆ మ్యాజిక్ క్రియేట్ చేసిందా లేదో తెలుసుకుందాం.

విక్రం – కార్తీ – జయం రవి – త్రిష – ఐశ్వర్యరాయ్ – శోభిత ధూళిపాళ్ల లాంటి ప్రముఖ నటీనటులు కీలకపాత్రల‌లో నటించిగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పిఎస్ 2 మొదటి భాగం కంటే చాలా బాగుందంటున్నారు. కథ‌ మరింత ఆసక్తిగా సాగుతుందని… చిత్రంలోని ఆర్ట్ డిజైన్‌తో పాటు పాటలు, డ్రామా చాలావరకు డీసెంట్గా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు ఓవరాల్ గా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

పీఎస్1 లోకి స్లోగా వెళ్లిన కథ రెండో భాగంలో మాత్రం కాస్త వేగంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎడిటర్ ఇంకా ట్రిమ్ చేస్తే సినిమా మరింత అదిరిపోయేదని చెబుతున్నారు. ఓవరాల్ గా చూస్తే మొదటి భాగం కంటే పార్ట్ 2 చాలా చాలా బాగుందని చెప్తున్నారు. ఇక పిఎస్ 2 ఫస్టాఫ్ అయితే ఆడియన్స్‌ను ఒక రేంజ్ లో ఫిదా చేసినట్టు చెబుతున్నారు. ప్రతి ప్రేమ్ అద్భుతంగా ఉందని.. మణిరత్నం దర్శకత్వం రవి వర్మ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

సిసి వర్క్, విజువల్స్, మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇక పార్ట్ వన్ మించిన స్క్రీన్ ప్లే పార్ట్ 2 లో ఉందని టాక్. ఇక పిఎస్ 2 క్లైమాక్స్ అయితే అదిరిపోయిందని అంటున్నారు. సినిమాలో వచ్చే యుద్ధ సన్నివేశాలు బాగా డిజైన్ చేసుకున్నారని చెబుతున్నారు. కొన్నిస్లో సీన్లు ఉన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంటూ చెబుతున్నారు. ఇక పీఎస్ 1తో పోలిస్తే పీఎస్ 2 తో మణిరత్నం ఎలాంటి సంచలనం నమోదు చేయబోతున్నాడో కొద్ది సేప‌ట్లో పూర్తి క్లారిటీ రానుంది.