‘ ఏజెంట్‌ ‘ కు బ్యాడ్ టాక్‌… అఖిల్‌ను మించి డిజాస్ట‌ర్‌…?

అక్కినేని అఖిల్ నటించిన తాజా సినిమా ఏజెంట్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఏజెంట్ కావాలని సరదాప‌డే కుర్రాడు. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న సిండికేట్.. దానిని చేధించే ఆపరేషన్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. వక్కంతం వంశీ కథ రాయగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ట్రైలర్ అంతా ఫుల్ యాక్షన్ సీన్లు కనిపించాయి. హాలీవుడ్ స్టైల్ ఫైట్లు ఉన్నాయి. అసలు కథ ఏంటన్నది ? పూర్తిగా అర్థం కాలేదు.

Big Confusion Over Akhil's Agent | Telugu Rajyam

సినిమాకు చేసిన భారీ ఖర్చు ట్రైలర్లో కనిపిస్తోంది. లొకేషన్ లో యాక్షన్ సీన్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అయితే అఖిల్ వాయిస్‌లో యూనిఫామ్ అన్నది పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏజెంట్ కు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి ఏకంగా మూడేళ్ల పాటు చెక్కారు. ఇప్పటికే బడ్జెట్ ఓవర్ అయింది. ఈ సినిమాకు మొత్తం రు. 80 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు తెలుస్తోంది.

చివరకు సినిమా క్వాలిటీ గా రావటానికి అఖిల్ తన రెమ్యూనరేషన్ సైతం త్యాగం చేశాడని చెప్పుకుంటున్నారు. ఇక ట్రేడ్ వర్గాల్లోనూ ఏజెంట్ విషయంలో అంత ఆసక్తి లేదని అంటున్నారు. అసలు నైజాంలో ఈ సినిమా రైట్స్ కొనేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఈనెల 28న సినిమా రిలీజ్ అవుతుంది. అఖిల్ ప్రమోషన్లలో బాగా హడావుడి చేస్తున్నాడు. అయినా కూడా ఏజెంట్ కు అంత హైప్‌ రావటం లేదు. ఒకవేళ సినిమా హిట్ అయినా ఈ సినిమా కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అవడం కష్టమే అని అంటున్నారు.

New Poster : Agent (Akhil Akkineni)

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అఖిల్ తొలి సినిమా అఖిల్‌ను మించిన డిజాస్టర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. సురేందర్ రెడ్డి సినిమా మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదని అంటున్నారు. ఏది ఏమైనా అఖిల్ హీరో అయ్యి ఎనిమిది ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సరైన హిట్ పడలేదు. మరి ఏజెంట్ తోఅఖిల్ దశ మారుస్తుంది అనుకుంటే.. రిలీజ్ ముందే ఇలాంటి నెగటివ్ టాక్ మూట‌గట్టుకుంది. మరి అఖిల్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడా లేదా ? అన్నది ఈనెల 28న తేలిపోనుంది.

&;

Tags: agent, Akhil, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news