హ్యాట్రిక్ ఓటమిల త‌ర్వాత అక్క‌డ టీడీపీ విక్ట‌రీ ఫిక్స్ ?

గత కొన్ని ఎన్నికల నుంచి టీడీపీ వరుసగా ఓడిపోతున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి..2004 నుంచి వరుసగా ఓటమి పాలవుతున్న స్థానాల్లో..ఇప్పుడు మళ్ళీ గెలుస్తారనే చర్చ సాగుతుంది. 1999 వరకు టి‌డి‌పి హవా ఉండటంతో అప్పటివరకు చాలా స్థానాల్లో టి‌డి‌పి మంచి విజయాలే నమోదు చేసుకుంది. కానీ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడిచింది..దీంతో పలు స్థానాల్లో ఓటమి పాలైంది.

Emlindia - To know about Madanapalle MLA Sri.Nawaz Basha... | Facebook

2014లో గెలిచి అధికారంలోకి వచ్చింది..కానీ ఇంకా అప్పుడు కూడా కొన్ని స్థానాల్లో ఓటమి పాలైంది.ఇక 2019 ఎన్నికలు గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే అలా వరుసగా ఓడిపోతున్న స్థానాల్లో ఈ సారైనా గెలవాలనే పట్టుదలతో టి‌డి‌పి పనిచేస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా హ్యాట్రిక్ ఓటమిని నమోదు చేసుకున్న మదనపల్లెపై ఈ సారి పట్టు సాధించాలని చూస్తున్నారు.

గతంలో ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. 1985, 1994, 1999, 2004 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. కానీ 2009 నుంచి టి‌డి‌పికి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. 2009లో ఓటమి పాలవ్వగా, రాష్ట్రంలో టి‌డి‌పి గాలి ఉన్న 2014లో కూడా ఓడిపోయింది. ఇక 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు. అప్పుడు వైసీపీ వేవ్ ఉంది. దీంతో ఇలా మూడుసార్లు మదనపల్లెలో టి‌డి‌పి ఓడిపోయింది. కానీ ఈ సారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని చెప్పి టి‌డి‌పి నేతలు పనిచేస్తున్నారు.

మదనపల్లి | Madanapalle

అటు వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు ఎలాగో ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ నాలుగేళ్లలో అక్కడ బాషా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా లేవు. ఇక సొంత కమ్యూనిటీ ముస్లింలకు చేసింది ఏమి లేదు. లోకేష్ పాదయాత్రతో అక్కడ టి‌డిపికి కాస్త ప్లస్ అయింది. ఇటీవల సర్వేల్లో మదనపల్లెలో టి‌డి‌పికి లీడ్ ఉందని తెలుస్తోంది. నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే టి‌డి‌పి నాలుగో ఓటమి నుంచి తప్పించుకుని విజయం సొంతం చేసుకోవచ్చు.