‘ ఆదిపురుష్ ‘ రివ్యూ… 50 % హిట్ – 20 % యావ‌రేజ్ – 30 % బోరింగ్‌

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ సినిమా గ‌త రెండేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చి ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కృతిస‌న‌న్ సీత‌గా న‌టించిన ఈ సినిమాకు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ లంకేశ్‌గా విల‌న్ పాత్రలో న‌టించారు. పాన్ ఇండియా సినిమాగా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌లు చోట్ల ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోయాయి. మ‌రి సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో చూద్దాం.

ఈ సినిమా ఫ‌స్టాఫ్ విష‌యానికి వ‌స్తే రామాయ‌ణంలోని అర‌ణ్య ఖండం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. రామాయ‌ణం యెక్క ఆధునిక వెర్ష‌న్‌లా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు. రాముడి నుంచి మంచి ఎలివేష‌న్లు తీసుకున్నాడు. రాముడిగా ప్ర‌భాస్ బాగానే సెట్ అయ్యాడు. గ్రాఫిక్స్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్‌లో డార్క్ టింట్ కార‌ణంగా ఇండియ‌న్ నేటివిటి మిస్ అయ్యింది.

నేపథ్య సంగీతం పర్వాలేదు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు సినిమా నీట్‌గా, డీసెంట్‌గా ముందుకు సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో ప్లాట్ నెరేష‌న్‌తో గ్రాఫ్ ఒక్క‌సారిగా కింద‌కు వ‌చ్చిన‌ట్టుగా ఉంటుంది. గ్రాఫిక్స్ ఎఫెక్ట్‌తో నేటివిటి మిస్ అయిన‌ట్టు ఉన్నా క‌థ ప‌రంగా రామాయ‌ణం గురించి తెలియ‌ని వాళ్ల‌కు బాగానే న‌చ్చుతుంది. రామాయ‌ణాన్ని ఆధునిక సూప‌ర్ హీరోల రేంజ్‌లో తెర‌కెక్కిన‌ట్టుగా ఉంది. ఓవ‌రాల్‌గా చూస్తే సినిమాపై ఉన్న హైప్‌తో పోలిస్తే ఎక్క‌డో త‌గ్గిన‌ట్టుగా అనిపిస్తుంది.

రామాయణాన్ని క‌మ‌ర్షియ‌ల్ కోణంలో తెర‌కెక్కించేలా చేసిన ప్ర‌య‌త్నంగా దీనిని చెప్పాలి. అయితే ఓం రౌత్ ఊహించిన దానికంటే కూడా విజువ‌ల్స్ ప‌రంగా మెప్పించాడు. రావణ కోట ఆర్ట్‌, రాక్ష‌సులు ఇవ‌న్నీ కూడా హిందూ పురాణాల కంటే హాలీవుడ్ స్టైల్‌ను పోలి ఉంటాయి. హనుమ, సుగ్రీవ గెటప్‌లు, వారి డెన్ ఆర్ట్‌వర్క్, వానర సైన్యం వీఎఫ్‌ఎక్స్ బాగున్నాయి. అయితే కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్ల‌లో కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ పేల‌వంగా ఉంది. అయితే ఇది పెద్ద అభ్యంత‌రం కాక‌పోవ‌చ్చు.

ఫైన‌ల్గా ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా… ఈ త‌రం వారికి రామాయ‌ణం గురించి తెలిసేలా ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమాకు ప్ర‌భాస్ పెద్ద ఎస్సెట్‌. 50 అద్భుతంగా ఉన్నా…. 20 శాతం యావ‌రేజ్‌.. 30 శాతం బోరింగ్ అన్న‌ట్టుగా ఉంది. మ‌రీ బాహుబ‌లి రేంజ్‌లో ఊహించుకుంటే ఓ సాధార‌ణ సినిమాగా అనిపిస్తుంది. ఓ సారి త‌ప్ప‌క చూడాల్సిన చిత్రం.

Tags: adhipursh, adhipursh movie, Bollywood, latest news, padipursh public talk, pan india hero, Prabhas, Tollywood, viral news