‘ ఆదిపురుష్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ టార్గెట్… హౌస్‌ఫుల్స్‌… టిక్కెట్లు నిల్ బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యింది…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా లెవ‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా రు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ ల్లో దుమ్ము రేపింది. ఆదిపురుష్. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే కొద్దిసేపు సర్వర్ క్రాష్ అయిపోయిందంటే అస‌లు ఈ సినిమా హ‌వా ఇండియా వైడ్‌గా ఎలా ? ఉందో తెలుస్తోంది.

Jai Shri Ram Telugu Video Song - Adipurush Video Songs

ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజెస్‌లో ఒక‌టిగా వ‌స్తోన్న ఆదిపురుష్‌కు ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంత ఉండొచ్చ‌నేది కూడా జోరుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న అడ్వాన్స్ బుకింగ్స్‌ల‌ను బ‌ట్టి చూస్తే ఫ‌స్ట్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లే ఈ సినిమాకు రు. 100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు. ఇదే జ‌రిగితే ఇదో బిగ్గెస్ట్ రికార్డ్ అవుతుంది.

ఒక్క హిందీ వెర్ష‌న్‌కే ఫ‌స్ట్ డే రు. 30 కోట్ల నెట్ వ‌సూళ్లు వ‌చ్చేలా అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి. ఇటు సౌత్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌తో క‌లుపుకుని రు. 80 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌స్తాయ‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. రు. 50 – 60 కోట్ల‌కు మ‌ధ్య‌లో అయితే త‌గ్గ‌వ‌నే అంటున్నారు. అటు ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్‌ల‌తో ఆల్రెడీ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది.

Adipurush public talk Archives - JSWTV.TV

ఓవరాల్ గా సినిమాకు పెంచిన టికెట్ రేట్లు, సినిమాపై ఉన్న హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ ఇవ‌న్నీ చూస్తుంటే ఫ‌స్ట్ ఆదిపురుష్ మ్యాజిక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఆదిపురుష్ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసేలా ఉంది. ఇక ఫ‌స్ట్ డే టాక్‌ను బ‌ట్టి ఆ త‌ర్వాత సినిమా రేంజ్ ఏంట‌నేది డిసైడ్ అవుతుంది.