ర‌జ‌నీ, క‌మ‌ల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌కే సూప‌ర్ హిట్లిచ్చిన స్టార్ హీరోయిన్‌.. చివ‌ర‌కు ఎయిడ్స్‌తో దిక్కులేని చావు..!

సినీ ఇండ‌స్ట్రీ అనేది ఒక మాయాజాలం ఇక్క‌డ అవ‌కాశాలు ఉన్నంత వ‌ర‌కే స్టార్లు. ఎప్పుడు అయితే అవ‌కాశాలు త‌గ్గిపోయాయో అప్ప‌టి నుంచి వాళ్లు సింపుల్‌గా ఫేడ‌వుట్ అయిపోతారు. వాళ్ల‌ను ఎవ్వ‌రు ప‌ట్టించుకోరు. ఇక హీరోల‌కు లాంగ్‌ర‌న్ ఉంటుంది. అదే హీరోయిన్ల‌కు మ‌హాఅయితే ఐదారేళ్ల లైఫ్ ఉంటేనే గొప్ప‌.. ఆ త‌ర్వాత వాళ్ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు.

హీరోయిన్లు అవ‌కాశాలు త‌గ్గిపోయాక కూడా ద‌ర్జాగా బ‌త‌కాలి అంటే వాళ్లు ఫామ్‌లో ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాలి.. బాగా సంపాదించుకోవాలి. అలా వెన‌కేసుకోక‌పోతే వాళ్ల‌కు ఛాన్సులు లేన‌ప్పుడు దీన‌స్థితిలోకి వెళ్లిపోతారు. ఒక‌ప్పుడు ఫేమ్ చూసుకుని మురిసిపోవ‌డ‌మే త‌ప్పా వాళ్లు ద‌ర్జాగా బ‌త‌క‌లేరు. ఇలా సినీ ప్ర‌పంచంలో ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్‌, ముమ్ముట్టి, క‌మ‌ల్‌హాస‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించి.. ఎన్నో సూప‌ర్ హిట్లు కొట్టిన ఓ హీరోయిన్‌.. చివ‌ర‌కు అవ‌కాశాలు లేక వ్య‌భిచారంలోకి దిగి ఎయిడ్స్‌తో మ‌ర‌ణించింది.

ఇంత విషాద జీవిత గాథ ఉన్న ఆ హీరోయిన్ పేరు నిషా నూర్‌. 1980ల్లో నిషానూర్ త‌న గ్లామ‌ర్‌తో కుర్ర‌కారుకు మాంచి కిక్ ఇచ్చేసింది. అస‌లు యూత్ ఆమె అంద‌చందాల‌కు ప‌డిపోయారు. అలాంటి నూర్ 1995 త‌ర్వాత అవ‌కాశాల్లేక పూట గ‌డ‌వ‌క చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ త‌ర్వాత ఆమె వ్య‌భిచార వృత్తిలోకి దిగింది. ఓ నిర్మాత ఒత్తిడితోనే ఆమె ఈ వృత్తిలోకి దిగింద‌న్న చ‌ర్చ‌లు అప్ప‌ట్లో న‌డిచాయి.

ఆ త‌ర్వాత కూడా ఆమెకు సినీ రంగం నుంచి ఎలాంటి సాయం చేయ‌లేదు. ఒకానొక ద‌శ‌లో ఆమె ఓ ద‌ర్గాలో అత్యంత దీన‌స్థితిలో త‌లదాచుకుంటోన్న విష‌యం తెలుసుకున్న త‌మిళ ఎన్జీవోలు ఆమెకు వైద్య‌ప‌రీక్ష‌లు చేయించ‌గా.. అప్పుడే ఆమెకు ఎయిడ్స్ ఉన్న‌ట్టు తేలింది. ఎయిడ్స్‌తో పోరాడుతూ 2007లో నిషా అనాథ‌లా క‌న్నుమూసింది.