ఫేస్‌కు మాస్క్ వేసుకున్న ఈ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..!

ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే మోస్ట్ బిజీ హీరోయిన్. చేతినిండా సినిమాల‌తో క్షణం ఖాళీ లేకుండా అలా ఎలా సినిమాలు చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. అటు సినిమాలే కాకుండా యాడ్స్ సైతం చేస్తుంది. ఇక ఆమె పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. అలాగే వ‌రుస‌గా సూపర్ హిట్లు కొడుతోంది. అలాగే ఈ బ్యూటీ చేసిన రెండు సినిమాలు పెళ్లిసంద‌డి, ధ‌మ‌కాతో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది.

ఈ క్ర‌మంలోనే ఈ భామ‌కు వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ బ్యూటీ ఎవరో కాదు శ్రీ లీల. శ్రీలీల సోషల్ మీడియాలో ఏ పోస్ట్ అప్లోడ్ చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతున్నాయి. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో 10 సినిమాలు దాకా ఉన్నాయి. మహేష్ బాబుతో నటిస్తున్న గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, పంజావైష్ణ‌వ్ తేజ్ ఆదికేశవ, రామ్ పోతినేని తో బోయపాటి, బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి సినిమాల‌లో నటిస్తుంది.

ఆమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌క్కువ టైంలోనే వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా…. తమిళంలో కూడా శ్రీ లీల మంచి ఛాన్సులు ద‌క్కించుకుంటోంది. తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం తెలుగులో పది సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీ లీల తమిళ్ సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అక్క‌డ స్టార్ హీరోల‌కు సైతం నో చెప్పేస్తుంద‌ట‌.