డీజే టిల్లు లాంటి సూపర్ హిట్ సినిమా మిస్ అయిన యంగ్ హీరో…!

కొన్ని సినిమాలు ప్రేక్షకులకు తెలియకుండా వారిని ఆకట్టుకుంటాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి డీజే టిల్లు.. ఈ పేరు చెప్పగానే ప్రేక్షకులకు తెలియకుండా ఓ వైబ్రేషన్ ఫీలింగ్ వస్తుంది. మనలో మనకి తెలియకుండానే ఒక కొత్త రకమైన ఆలోచన పుట్టించే సినిమానే డీజేటిల్లు.

ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటనతో ప్రేక్షకులను మైమరిపించాడు. అంతేకాకుండా ఈ సినిమాతో సిద్ధుకు యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ వ‌చ్చేసింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ కాపాడుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి కూడా తన నటన, గ్లామర్ షో తో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా కన్నా ముందు రెండు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ సిద్దుకు ఈ సినిమాతో వచ్చింది.

తెలంగాణ యాసలో సిద్దు చెప్పే డైలాగులు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి చెవులో వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఏ ఫంక్షన్‌కు వెళ్ళినా ఈ సాంగ్ లేకుండా ఆ ఫంక్షన్ ఉండదు. అంతలా ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ తన మార్క్‌ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాను ముందుగా దర్శకుడు సిద్దు జొన్నలగడ్డతో తీయాలని అనుకోలేదట. ఆయన స్థానంలో మరో యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ ని ఈ సినిమాలో హీరోగా అనుకున్నారట.

విశ్వక్‌కు ఈ సినిమా కథ‌ ముందుగా చెప్పగా కథనచడంతో ఈ సినిమా చేయాలని భావించారట. కానీ అదే సమయంలో ఇతర సినిమాల డేట్స్ తో బిజీగా ఉండడంతో డేట్స్ ఇవ్వలేకపోయారు. తర్వాత దర్శకుడు సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఈ సినిమా చేశాడు. ఆ త‌ర్వాత సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక అందులో సిద్దుకు జంటగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుంది.