టీడీపీలోకి ఓ టాప్ లీడ‌ర్‌… ఆ ఇద్ద‌రికి చెక్ త‌ప్ప‌దా..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ మాజీ చీఫ్‌.. మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్‌. అనంత‌పురం జిల్లా శింగ‌న మ‌ల నియోజ‌క‌వ ర్గం మాజీ ఎమ్మెల్యే. ప్ర‌స్తుతం ఈయ‌న టీడీపీ బాట‌ప‌డుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ప‌నిచేసి.. మంచి పేరు తెచ్చుకున్న సాకే.. వైఎస్ అనుచరుడిగా గుర్తింపు పొందారు. వృత్తి గ‌తంగా ఆయ‌న ఎంబీబీఎస్ వైద్యుడు. ప్ర‌స్తుతం అనంత‌పురంలో వైద్య వ్యాపారంలోనూ ఉన్నారు.

Stop political dramas in the name of bus yatra: Sailajanath

అయితే.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ పంచ‌న చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీ వల చంద్ర‌బాబును క‌లిసేందుకు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నించార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో అలెర్ట్ అయిన‌.. కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు.. సాకేతో చ‌ర్చించార‌ని స‌మాచారం.

ఒక్క ఎన్నికతోనే పక్కన పెట్టేశారే? | in the last election, bandaru sravani contested from singanamala constituency and lost.

దీనికి ఆయ‌న అంద‌రూ చెప్పేదే.. అబ్బెబ్బే.. అలాంటిదేమీ లేదు.. అని చెప్పుకొచ్చారు. కానీ, అంత‌ర్గ‌తంగా మాత్రం.. చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని అంటున్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్‌నేత‌ల‌కు కూడా ఉప్పందింద‌ని.. పార్టీ అధిష్టానం వ‌ర‌కు కూడా విష‌యం తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు.

TDP SC Cell President MS Raju Fires On AP CM Jagan

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇద్ద‌రితో త‌ల‌నొప్పులు ప‌డుతోంది. బండారు శ్రావ‌ణి, ఎం.ఎస్ రాజులు గ‌ట్టిపోటీలో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోత‌మకంటే త‌మ‌కేన‌ని పోటీ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సాకేను చేర్చుకుంటారా? అనేది సందేహం. సాకే పార్టీలోకి వ‌స్తే శ్రావ‌ణి, రాజుకు టిక్కెట్ విష‌యంలో షాక్ త‌ప్ప‌దు.