ఎన్టీఆర్ కోసం తన రూల్స్ బ్రేక్ చేసిన స్టార్ లెజండరీ డైరెక్టర్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇది ఓ సంచలనం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ తో మొదలైన విజయ దండయాత్ర కొన‌సాగుతోంది. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్‌ చేశాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఎన్టీఆర్ నటనకు ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఎందరో హాలీవుడ్ దర్శకులు ఎన్టీఆర్ నటనకు పొగడ్తలు వర్షం కురిపించారు.

Jr NTR Upcoming Movies 2023 & 2024 with Release Date, Budget, Trailer &  More - JanBharat Times

ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అంటూ ఎందరో హాలీవుడ్ దర్శకులు తమ మనసులోని మాటలు బయటపెట్టారు. అంతేకాకుండా బాలీవుడ్ దర్శకులు సైతం ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ తో వార్2 సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ సంవత్సరం చివర్లో ప్రారంభం కానుంది.

Happy birthday Sanjay Leela Bhansali: Here's his HUGE net worth

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే బాలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ, ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

Jr NTR nodded head for Sanjay Leela Bhansali?

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా ఆయనకి ఇష్టమైన హీరోయిన్ అలియా భట్ నటించబోతుందని కూడా తెలుస్తుంది. సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటివరకు ఏ హీరో డేట్స్ కోసం ఎదురు చూడకపోయినా మొట్ట మొదటిసారిగా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అయినా డేట్లు కోసం వేచి చూస్తున్నాడు. అతి త్వరలోనే ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది అని కూడా తెలుస్తుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.