టిక్కెట్ల కోసం చంద్ర‌బాబుకు పెద్ద సిఫార్సులు… ఎవ‌రెవ‌రికి సీట్లు అంటే…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త నెల రోజుల నుంచి చాలా చాలా బిజీగా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. పా ర్టీలో చేరేవారు.. సీట్లు ఆశించేవారి పార్టీలో పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుంద‌నే అంచ‌నాలు బ‌ల‌ప‌డుతున్న కొద్దీ.. చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదేమీ.. పోసుగోలు క‌బురు కాదు.. వాస్త‌వ‌మేన ని సీనియ‌ర్లు కూడా చెబుతున్నారు. వ‌చ్చేవారంతా.. వ్యాపారులు కావ‌డం.. భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేవారు కావ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. సుమారు 10 మంది వ‌ర‌కు ఎన్నారైలు ఉన్నార‌ని పార్టీలో గుస‌గుస వినిపిస్తోంది. వీరికితోడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇద్ద‌రు వేచి చూస్తున్నార‌ని.. త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఖ‌ర్చులు కూ డా పెట్టుకుంటామ‌ని.. వారు రాయ‌బారాలు న‌డుపుతున్నారు. అదేస‌మ‌యంలో వార‌సుల‌కు లెక్క‌లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు వ్యాపారులు కూడా పార్టీవైపు చూస్తున్నా రు.

ఇలా వ‌స్తున్న‌వారిలో ఎక్కువ మంది ఎన్నారై టీడీపీ క‌న్వీన‌ర్ జ‌య‌రాం కోమ‌టి వ‌ర్గానికి చెందిన వారు ఉన్నార‌ని టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. త‌మ‌కు అవ‌కాశం ఇస్తే.. రెండు మూడు పార్ల‌మెంటు నియోజ క‌వ‌ర్గాల్లో అయ్యే ఖ‌ర్చును భ‌రిస్తామ‌ని కూడా వారు చెబుతున్నారు. అంతేకాదు.. మ‌రికొంద‌రు.. ఏకంగా.. పార్టీకి భారీ విరాళం ఇస్తామ‌ని.. త‌మ‌కు అవ‌కాశం ఇప్పించాల‌ని.. ఓ మీడియా అధినేత నుంచి కూడా.. ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇక‌, వార‌సుల సంగ‌తి స‌రే స‌రి! గ‌త ఎన్నిక‌ల్లోనూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వార‌సుల సంఖ్య పెరుగుతుందని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇలా.. వీరి నుంచి వ‌స్తున్న పోన్లు, సిఫార‌సుల‌తో గ‌త నెల రోజులుగా చంద్ర‌బాబు బిజీగా ఉన్నార‌ని అంటున్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నందున‌.. ఇలాంటి వాటిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన ఒక రియ‌ల్ వ్యాపారి కూడా.. ఉభ‌య గోదావరి జిల్లాల్లో టికెట్ ఆశిస్తున్నారు. ఈయ‌న ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. ఇలా.. అనేక మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.