సిల్లీ రీజ‌న్‌తో ‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ వ‌దులుకున్న హీరో… ఎంత బ్యాడ్ అంటే…!

బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ తన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అలానే తన హ్యాండ్స‌మ్ లుక్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరియర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రామ్ కెరియర్ లోనే ఇస్మార్ట్ శంకర్ ఒక ట‌ర్నింగ్ పాయింట్‌.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో న‌భా న‌టేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా రామ్ న‌టించిన ఈ సినిమా 2019 జూలై 18న థియేటర్ల‌లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ ఈ కథను రామ్ పోతినేని కోసం కాకుండా వేరే హీరోను ఊహించుకుని రాసాడట. ఆ హీరో ఏవో చిన్న కారణాలతో సినిమాను రిజెక్ట్ చేశాడట‌.

ఆ హీరో ఎవ‌రో కాదు విజయ్ దేవరకొండ. విజయ్ ఇస్మార్ట్ శంకర్ క‌థ‌ను రిజెక్ట్ చేశాడట‌. పూరి జగన్నాథ్ ఈ కథను రాసిన తర్వాత విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి కథను వినిపించాడట. విజయ్ కి ఈ సినిమా నచ్చినా స్లాగ్‌, మాస్ క‌టౌట్ తన ఫేస్ కి సెట్ అవ్వవు అనే రీజన్ తో రిజెక్ట్ చేశాడట. దీంతో ఈ సినిమా రామ్ పోతినేని చేతికి వెళ్ళింది. ఈ సినిమాతో రామ్ ఒక బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

త‌ర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ల లైగ‌ర్ సినిమా వచ్చినా ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కి కోట్ల‌లో నష్టం వచ్చింది. ఈ కారణంతో ఎన్ని వివాదాలు జరిగాయి ఆ అందరికీ తెలుసు. అందుకే ఆ త‌ర్వాత పూరి – విజ‌య్ కాంబోలో రావాల్సిన జ‌న‌గ‌ణ‌మ‌ణ సినిమా కూడా ఆగిపోయింది