ఈ క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ల‌నే మ‌హేష్‌బాబు ఇష్ట‌ప‌డ‌తాడా… ఆ సీక్రెట్ ఇదే….!

సూపర్ సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు. తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్న మహేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా స్టార్ హీరోస్ చాలామంది నటించే సినిమాలో హీరోయిన్ల‌ను వారే సెలెక్ట్ చేసుకోవడం ఎప్పటినుంచో ఆనవాయితీ. అలాగే మహేష్ బాబు కూడా తన సినిమాలో హీరోయిన్ల‌ను మ‌నోడే సెలెక్ట్ చేసుకుంటాడు. అయితే ఈ విష‌యంలో మ‌హేష్ త‌న తండ్రి రూట్లోనే వెళుతున్నాడు.

మహేష్ ఓన్‌గా సెలెక్ట్ చేసుకున్న ఏ హీరోయిన్ కూడా మహేష్ బాబుకి ఫ్లాప్ ఇవ్వలేదట. మ‌హేష్ తన సినిమాలో ఎవరినైనా హీరోయిన్ గా సెలెక్ట్ చేయాలంటే ముందుగా ఆ హీరోయిన్ ఫేస్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, డ్యాన్స్‌, సాడ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఎలా చేస్తుంద‌ని ? మొద‌టి నుంచి అబ్జర్వ్ చేస్తాడట. ఈ సీన్ల‌లో ఎలా చేస్తుంద‌న్న దానిపై మ‌హేష్‌కు అవ‌గాహ‌న ఉండి… వీటిల్లో ఆ హీరోయిన్‌కు మంచి మార్కులు ప‌డితే వెంట‌నే ఆమెను హీరోయిన్‌గా సెల‌క్ట్ చేస్తాడ‌ట‌.

అలా మ‌హేష్ హీరోయిన్ల‌ను ఎంచుకుని చేసిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయినా హీరోయిన్ బాగా నటిస్తుంది అనే పేరు వచ్చింది. అయితే గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా అలాగే హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసేవారట. ఫ్లాప్ అయిన హీరోయిన్స్ ని కూడా వారి సినిమాల్లో పెట్టుకుని ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు కృష్ణ.

ఇప్పుడు మహేష్ బాబు కూడా హీరోయిన్స్ ఫ్లాప్ సినిమాల్లో ఉన్నారా.. హిట్ సినిమాల్లో ఉన్నారా ? అని కాకుండా పాత్రకి న్యాయం చేస్తున్నారా..? లేదా..? అని చేసుకుంటూ అవకాశాలు ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు కారం సినిమాలో న‌టిస్తున్నాడు.