వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి పెళ్లిపై వేణుస్వామి చెప్పిన షాకింగ్ నిజం…!

సినిమా రంగంలో సెలబ్రిటీల గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి చెబుతున్న అన్ని విషయాలు నూటికి నూరు శాతం నిజం అవుతున్నాయి. ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయితేనే రష్మిక తన కెరీర్లో విజయం సాధిస్తుందని వేణుస్వామి చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజం అయ్యింది. నిధి అగర్వాల్, రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు వేణు స్వామి తో పూజలు చేయించుకుని సక్సెస్ కొడుతున్నారు. అలాగే నాగచైతన్య – సమంత జంట కూడా వివాహం చేసుకున్న తర్వాత విడిపోతారని వేణు స్వామి చెప్పిన మాట కూడా నిజం అయింది.

ఒక సినీ నటుడు చనిపోతాడని వేణు స్వామి చెప్పినట్టుగానే హీరో తారకరత్న మృతి చెందారు. విచిత్రం ఏంటంటే ఓ యంగ్ హీరో చనిపోతాడు అంటూ వేణు స్వామి తారకరత్న మరణాన్ని ముందే ఊహించారు. ఇక ప్రభాస్ సినిమాల గురించి ఆయన చెప్పినట్టుగానే జరుగుతోంది. అలాగే రాంచరణ్ కి పుట్టే పిల్లల గురించి కూడా ఎప్పుడు ? పుడతారు అనేది వేణు స్వామి ముందే చెప్పారు.

అలాగే త్వరలోనే ఒక హీరో, ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటారని వేణు స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి నిజం కాబోతున్నాయి. వేణు స్వామి ఆ మాటలు చెప్పిన వెంటనే టాలీవుడ్ లో ఆ హీరో హీరోయిన్ ఎవరబ్బా ? అని ప్రతి ఒక్కరూ తెగ ఆలోచనలో పడిపోయారు.

ఇప్పుడు వేణుస్వామి మాటకు తగ్గట్టుగానే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. దీంతో వేణు స్వామి చెప్పిన మాటలు మరోసారి నిజం అయ్యాయి.