ఏపీ సర్కారుకు టీడీపీ ఝలక్.. స్థానిక ఎన్నికలపై నీలినీడలు..!

త్వరితగతిన స్థానికసంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆ దిశగా చకచకా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు, నోటిఫికేషన్ ఇచ్చి  21న ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. అదేవిధంగా మార్చి 10న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసి.. మార్చి 24వ ఎన్నికలు నిర్వహించాలని, పనిలో పనిగా మార్చి 15న గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిది. ఈ మేరక ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తున్నది. ఉత్సాహంగా అడుగులు వేస్తున్న వైసీపి సర్కారు గట్టి ఝలక్ ను ఇచ్చింది విపక్ష టీడీపీ.

స్థానిక ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లతో టీడీపీ మాత్రం బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నది. ఇదే విషయమై ఇప్పుడు ఏకంగా న్యాయపోరాటానికి దిగింది.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కోర్టు విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీసీ రిజర్వేషన్లను తగ్గించడం వల్ల 140 వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోందని.. 16 వేల పదవులను బీసీలు కోల్పోవాల్సి వస్తోందని టీడీపి వాదిస్తున్నది. ఒకవేళ కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తే.. ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అలాగే టీడీపీ నేతల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కూడా కలిసారు. ప్రజాస్వామ్య పద్ధతిలో స్థానిక ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు, నీటి ట్యాంకులు, విద్యుత్‌స్తంభాలకు వేసిన వైసీపీ రంగులపై ఫిర్యాదు చేశారు. అలాగే స్థానిక ఎన్నికల విధులకు వలంటీర్లను దూరంగా ఉంచాలని కమిషనర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Tags: AP, BC Reservations, LocalBody Elections, Supreme Court Petition, tdp, YS Jagan, ysrcp