కరోనా దెబ్బకు ఢిల్లీలో మార్చి 31వరకు సెలవులు..!

కొవిడ్ 19 కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు గజగజ వణికి పోతున్నాయి. ఇప్పటికే చైనాలో వేలాది మంది దీని బారిన పడి మృత్యు వాత పడ్డారు. దాదాపు మూడు వేల మంది మరణించినట్లు అధాకారిక లెక్కలే చెబుతుండాగా, 90వేల మంది చికిత్స‌పొందుతున్నారు. చైనాలో కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ఇతర దేశాల్లో మాత్రం కొత్త కేసులు నమోదవుతుండడం తీవ్ర కలకలం రేపుతున్నది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 29 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ (17), ఆగ్రా (6), జైపూర్ (2), హైదరాబాద్ (1), కేరళ (3) కేసులు పాజిటివ్ వచ్చాయి. మరోవైపు దీని ధాటికి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. జనం భయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట సంస్థలు కూడా వణికిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ భయం మరీ ఎక్కువగా ఉంది.

తాజాగా ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలకు ఈనెల 31 వరకు సెలవును ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ప్రకటన ను విడుదల చేశారు. ఈనెల 6వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసేయాలని నిర్ణయించినట్టు మనీష్ సిసోడియా స్పష్చం చేశారు. ప్రజల్లో కరోనా భయం వల్ల ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనీష్ సిసోడియా తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను రద్దు చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపాయి.

Tags: corona virus, delhi, Holidays, INDIA, Schools