దిశా సినిమా షూటింగ్ ప్రారంభం.. చటాన్ పల్లిలో మొదటి షాట్..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ పై తదనంతర పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ ఉదంతంపై సినిమా తీస్తానని ఇప్పటికే ప్రకటించి మరింత సంచలనం రేపారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. యథార్థగాథలను, వివాదాస్పద కథాంశాలను తెరకెక్కిచడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికె ఆ తరహా చిత్రాలను వెండితెరపై తనదైన శైలీలిలో ప్రదర్శించి విమర్శకులు మెప్పును పొందారు. బ్లాక్ బస్టర్ లను అందుకున్నారు. పలుసార్లు అంతే స్థాయిలో ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యారు. అయినా తన పంథాను మాత్రం ఆయన ఎప్పుడూ వీడలేదు. ఈ నేపథ్యంలోనే దిశా ఘటనకు సైతం దృశ్యరూపం ఇచ్చెందుకు సన్నద్ధమయ్యారు. ఎవరైనా నేరం చేయాలంటే జంకేలా చిత్రాన్ని తెరకెక్కిస్తానని బాహాటంగానే ప్రకటించారు. ఇప్పటికే ఆ కేసుపై పూర్తిగా స్టడీ చేశారు. అందులో భాగంగా కేసులోని నిందితులకు సంబంధించిన కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే.

తాజాగా వర్మ దిశా చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టాడు. దిశను ఎక్కడైతే కాల్చి చంపారో.. అక్కడే ఆ చటాన్ పల్లి సమీపంలోనే తొలి షాట్ చిత్రీకరించాడు మన ఆర్జీవి. వర్మ. రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద వద్ద ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన కీలక సన్నివేశాలను రియలిస్టిక్ గా అదే ప్రాంతంలో చిత్రీకరిస్తున్నాడు వర్మ. ఈ క్రమంలోనే దిశపై తొండుపల్లి టోల్ గేట్ వద్ద అత్యాచారం చేసిన తర్వాత మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో నిందితులు తీసుకొచ్చే సన్నివేశాన్ని మొదటగా చిత్రీకరించారు. అనంతరం మృతదేహాన్ని కాల్చడం, స్కూటీ, లారీతో సన్నివేశాలను తెరకెక్కించారు. ఇప్పటికే సినిమా పై అంచనాలు పెరగగా, వర్మ సినిమా షూటింగ్ విధానంతో సినిమాపై మరింత హైప్ ను పెంచుతున్నాయి.

Tags: Disha, RamGopal Varma, Shooting, Tollywood