అప్పుల కోసం విశాఖలో జగన్ తిప్పలు…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని విశాఖ కు తరలించాలి అనుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అసలు అమరావతిలో అన్నీ ఉండగా అభివృద్ధి చెందిన నగరం రాజధాని తరలించడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ప్రభుత్వం మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే అక్కడి పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. హైకోర్టు వద్దని చెప్పినా సరే ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి కనబడటం లేదని చెప్పాలి.

రాజధానిని విశాఖకు తరలిస్తూ తరలించాలని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య మాత్రం తీవ్రంగా వేధిస్తోంది. విశాఖలో రాజధానిని పెట్టాలి అని భావిస్తున్న ప్రభుత్వం గత కొంతకాలంగా అక్కడ భవనాల కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అమరావతి నుంచి వెళ్ళిన కొందరు అధికారులు భవనాల కోసం విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం పలు ఐటీ కంపెనీలకు ఇచ్చిన భవనాలను అంటే మిలీనియం టవర్స్ లాంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది.

అక్కడ ఉన్నటువంటి భవనాలలో సచివాలయ శాఖలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి అక్కడ ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఇప్పుడు పలు ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విశాఖలో పాలన మొదలు పెట్టాలి అని భావిస్తున్న వైఎస్ జగన్ సర్కారు ఇప్పుడు విశాఖ వెళ్ళిపోవాలని అక్కడ వాటిని ఖాళీ చేయించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను భవనాలకు ఖాళీ చేయమని జగన్ సర్కార్ చెప్పినట్లు సమాచారం.

అయితే ఇక్కడ మరో వ్యూహం కూడా జగన్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విశాఖ లో ఉన్న ప్రభుత్వ భవనాలను తనఖా పెట్టే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయం భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే వడ్డీ ఎక్కువ ఇస్తామంటూ పలు బ్యాంకులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. విశాఖలో గత ప్రభుత్వం కట్టిన భవనాలను తనఖా పెట్టి మూడు రూపాయల వడ్డీ అయినా చెల్లించి రుణాలు పొందాలని భావించినట్టు తెలుస్తుంది.

Tags: AP, Loans, Visakapatnam, YS Jagan, ysrcp