శవ్యాప్తంగా సంచలనం రేపిన ధిశా ఘటన నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రత్యేక చర్యలను చేపట్టింది. రాష్ర్టంలో మహిళలకు భద్రతకు భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నది.జిల్లాకో దిశా పోలీస్‌స్టేషన్‌ను, న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్ శనివారం ప్రారంభించారు. త్వరంలోనే మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ స్టేషన్‌లో మొత్తంగా 52 మంది సిబ్బంది విధులను నిర్వర్తించనున్నారు. మహిళ రక్షణ కోసమే పనిచేయనున్నారు. అందులో డిఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ ఐలు, మహిళా కానిస్టేబుళ్లు ఉండనున్నారు.
ఇదిలా ఉండగా త్వరంలోనే జిల్లాకో దిశా న్యాయస్థానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అదేవిధంగా యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకురానున్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం ఏపీ సర్కారు ఇప్పటికే దిశా చట్టాన్ని రూపొందించింది. దానిని అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంట్‌కు పంపింది. అయితే ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. పలు సవరణలను సూచించింది. అనంతరం తిరిగి బిల్లును పార్లమెంట్‌కు పంపాలని కోరింది. ఈ నేపథ్యం కేంద్రం సూచించిన సవరణలను చేసే పనుల్లో ఏపీ సర్కారు ప్రస్తుతం నిమగ్నమయింది.