ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఒకవైపు 53 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తూ మరోవైపు రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అని నినదిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని సైతం కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. రలోనే బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను , పలువురు మంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లారు. ఏపీ రాజధానిగా అమరావతినే ఉండేవిధంగా ఆశీర్వదించాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మనసు మార్చాలని కోరుకున్నారు. వనదేవతలకు బంగారం సమర్పించుకున్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతినే ముద్దు అంటూ అక్కడా నినదించారు.