సిబిఐ విషయంలో జగన్ తప్పు చేస్తున్నారా…?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు జరిగిన మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. దీనిపై అనేక విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నో వినపడుతూనే ఉన్నాయి గానీ ఇప్పటివరకు కేసు తుది దశకు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలోనే సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటీషన్ జగన్ ఉపసంహరించుకున్నారు.  దీనితో జగన్ సర్కార్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎన్నికలకు ముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తోనే విచారణ చేస్తున్నారు. ఇటీవల వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈ కేసులో విచారణ కోసం సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి భార్య కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన సీబీఐకి అప్పగించాలి అనే పిటిషన్ ను విత్ డ్రా  చేసుకోవడం అనేక అనుమానాలకు వేదికగా మారింది. దీనిపై హైకోర్టు కూడా అసలు ఎందుకు విత్ డ్రా చేసుకుంటున్నారు అనేదానిని లేఖలో తెలపాలని జగన్ తరపు న్యాయవాది కి  సూచించింది. దీనితో ఇప్పుడు అన్ని వేళ్ళు ప్రభుత్వాన్ని చూపిస్తున్నాయి. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి కేసును సీబీఐకి అప్పగిం చారు. ఈ విషయం అందరికి తెలిసిందే. అలాంటిది ఈ కేసు ఇంత తీవ్రంగా ఉన్నా సరే జగన్ ఎందుకు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదని అసలు ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఒకవేళ సీబీఐ విచారణకు ఆదేశిస్తే కలిసి వచ్చేది  జగన్ కె కదా అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు

Tags: CBI Inquiry, high court, Murder Case, YS Jagan, YS Vivekanand Reddy, ysrcp