రాజధాని పోల్: వైసీపీ ఫేస్‌బుక్ పేజ్‌లో అమరావతికి మెజారిటీ!

గత రెండు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిపై రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏమో మూడు రాజధానులు అంటుంటే….టీడీపీ ఏమో అమరావతి అంటుంది. ఇక ప్రజలు కూడా ప్రాంతాల వారీగా ఒక్కో నిర్ణయానికి మద్ధతు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం ఏకాభిప్రాయంతో మాత్రం లేదని స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే ఈ పరిస్తితి ఇలా కొనసాగుతున్న తరుణంలోనే ‘వైసీపీ ఫోరమ్’ అనే ఫేస్‌బుక్ పేజ్‌లో రాజధానిపై పోల్ పెట్టారు.

ఇక ఈ పోల్‌లో అమరావతికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ‘వైసీపీ ఫోరం తమ ఫేస్‌బుక్ పేజ్‌లో ఓ పోల్‌ నిర్వహించింది. రాజధానిగా అమరావతి బాగుంటుందా? లేక విశాఖపట్నమా? అన్న విషయాలను తెలపాలని కోరింది. మొత్తం 1.13 లక్షల ఓట్లు వస్తే అమరావతికి 77 శాతం ఓట్లు, విశాఖకు 23 శాతం ఓట్లు వచ్చాయి’ అని గల్లా జయదేవ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags: amaravathi, AP, Poll, Vizag, ysrcp