మలయాళం హిట్ చిత్రం ప్రేమమ్‌తో వెలుగులోకి వచ్చిన సాయిపల్లవి అనతికాలంలోనే తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తన మల్టీ టాలెంట్‌తో, అదరగొట్టే డ్యాన్స్‌లతో అనతికాలంలోనే అగ్రనాయికగా పేరు తెచ్చుకుంది. ఫిదా సినిమాలో తెలంగాణ యాసతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తరువాత నేచురల్ స్టార్ నాని సరసన మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ)లో నటించి మరో హిట్టును అందుకుంది. ప్రస్తుతం నీదినాది ఒకే కథ ఫేమ్ ప్రవీణ్‌కుమార్ ఉడుగుల తెరకెక్కిస్తున్న విరాటపర్వం సినిమాలో హీరో దగ్గుబాటి రానాకు జోడిగా నటిస్తున్నది. ఒక తెలుగులోనే అటు తమిళం, మలయాళి సినిమాల్లోనూ నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నది.
ఇదిలా ఉండగా హిరోయిన్ సాయిపల్లవి అరుదైన ఘనతను సాధించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యగజైన్ రూపొందించిన ఓ జాబితాలో చోటు సంపాదించుకుంది. వివిధ రంగాలను ఎంచుకుని విజయాలను సాధించిన 30 ఏళ్ల యువత జాబితా ఆ పత్రిక ప్రకటించింది. అందులో వినోదపు విభాగంలో 27 సంవత్సరాల సాయిపల్లవి స్థానాన్ని కైవసం చేసుకుంది. నటి సాయిపల్లవి అత్యంత అంకితభావం, స్ఫూర్తినిచ్చే కథానాయికని ఆ పత్రిక కొనియాడింది. దీనిపై టాలివుడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సాయిపల్లవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. తమ అభిమాన తార మరింత ఉన్నతికి ఎదగాలని వారు ఆకాంక్షిస్తున్నారు.