కేంద్ర మంత్రులను కలవలేని జగన్, మండలి రద్దు చేస్తారా…?

చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందుకు వెళ్లారు. శాసనసభలో దీనిపై సోమవారం సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా 133 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. అంతవరకు బాగానే ఉంది గాని అసలు ఇప్పుడు ఈ బిల్లును కేంద్రం ఆమోదిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వెళ్లి స్వేచ్ఛగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భం ఎప్పుడూ లేదు. కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానిని కలిశారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ కలవలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై కేంద్రం కూడా తీవ్ర ఆగ్రహంగా ఉంది.

ఈ నేపథ్యంలో తన పట్టుదలకు పోయి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేసి దానిని ఒకే రోజు క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆమోదించారు. కనీసం ఎవరి అభిప్రాయం కూడా తీసుకోకుండా సొంత నిర్ణయంతో జగన్ ముందుకు వెళ్లారు. ఇలాంటి నిర్ణయాన్ని కేంద్ర ఎంత వరకు ఆమోదిస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. ప్రధాని గాని కేంద్రమంత్రులను గాని కలవలేని జగన్ ఈ బిల్లును ఆమోదించాలని కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి చేస్తారు…?

ఇప్పుడు ఈ ప్రశ్న వైసీపీ కార్యకర్తలను కూడా తీవ్రంగా వేధిస్తున్నట్టు సమాచారం. కేంద్రం ఆమోదించకపోతే మాత్రం జగన్ ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నిజంగా ఈ బిల్లును కేంద్రం ఆమోదిస్తుందని జగన్ భావించినప్పుడు, మండలిలో సభ్యులుగా ఉన్న తన ఇద్దరు మంత్రులతో కూడా రాజీనామా చేయించి, ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అది చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది.

Tags: AP, bjp, Cancillation, Legisletive Council, YS Jagan