ఎమ్మెల్యేలకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్…!

వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వాస్తవానికి రాజధాని విషయంలో జగన్ ఊహించని స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని ఆ పార్టీ నిఘా వర్గాలు చెప్పినట్టు సమాచారం. ఈ  నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. మొన్నటి వరకు జగన్ అంచనా ప్రకారం కృష్ణా-గుంటూరు జిల్లాలకు మాత్రమే ఉన్న రాజధాని ఉద్యమం ఇప్పుడు ప్రకాశంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వ్యాపించింది.

ఇక రాయలసీమలో కూడా హైకోర్టు వస్తే తమ ఉపయోగం ఏంటీ అని అక్కడి ప్రజలు భావిస్తున్నారట. దీనితో రాయలసీమ ఉద్యమం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు బిజెపి కూడా రాయలసీమ ఉద్యమం మీద దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో  జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు కొన్ని కీలక సూచనలు చేసినట్లు సమాచారం. తనకు తెలియకుండా ఎమ్మెల్యేలు ఎవరూ కూడా నియోజకవర్గాలకు, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పార్టీ ఆఫీసులకు వెళ్లి పార్టీ కార్యకర్తలతో సమావేశం పెట్టొద్దని,

రాజధాని అంశం మీద మాట్లాడొద్దని ఒకవేళ మాట్లాడినా సరే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి ప్రజలకు సర్ది చెప్పే విధంగా ప్రవర్తించాలి గాని, ఎక్కడా కూడా సొంత ప్రసంగాలు చేయవద్దని దాదాపు సాధ్యమైనంతవరకు నియోజకవర్గాలకు దూరంగా ఉండమని, ఒక రెండు నెలలు నియోజకవర్గానికి దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలకు జగన్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. రాజకీయంగా ఇప్పుడు పరిస్థితులు అంత బాగా లేదని కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఖరారయ్యే వరకు కూడా నియోజకవర్గాలకు దూరంగా ఉండమని కీలక నేతలకు కూడా జగన్ చెప్పారట.

Tags: AP, MLAs, YS Jagan, ysrcp