యంగ్ టైగర్ సింహాద్రి ర‌చ్చ … ఈ క్రేజ్ ఏంట్రా బాబు..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలోను హోరెత్తిస్తున్నారు.. ఎక్కడ చూసినా ఒకటే మాట ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ హంగామా చేస్తూ మిగిలిన హీరోల అభిమానులు సైతం ఈ క్రేజ్ ఏంటి సామీ అనేలా చేస్తున్నారు. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఫొటోస్, వీడియోలను ఇలా ఏదో ఒకటి వైరల్ చేస్తూ ఈ నెల మొత్తం సోషల్ మీడియాని కబ్జా చేసేశారు.

Simhadri'

ఈ రచ్చని మరో లెవల్ కు తీసుకు వెళ్తూ… ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. సింహాద్రి రీ రిలీజ్ ఇప్పటివరకు ఏ హీరో రీరిలీజ్ సినిమా మైంటైన్ చేయనంత హైప్‌ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్- రాజమౌళి కాంబో నుంచి వచ్చిన ఈ మాస్ ఫీస్ట్ మళ్లీ థియేటర్లో చూడ‌డానికి అభిమానులు రెడీ అయ్యారు.

Watch Simhadri movie - Starring Jr.NTR as Lead Role on ETV Win | Download  ETV Win on Playstore

ఈ సినిమా ఓవర్సీస్ లోనే 100 స్క్రీన్ లో రీ రిలీజ్ అవబోతుందంటే సింహాద్రికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సింహాద్రి రీరిలీజ్ కి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది.. కానీ ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయగా వెంట‌నే ఫిల్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింహాద్రి రీ రిలీజ్‌లో ఆరు బెనిఫిట్ షోలు ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోయాయి.

Simhadri (2003) - Photo Gallery - IMDb

దీంతో ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్ల‌లో కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఎన్టీఆర్ అభిమానులు చేస్తోన్న ర‌చ్చ అయితే మామూలుగా లేదు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రియేట్ చేయబోయే కొత్త బాక్సాఫీస్ రికార్డులు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలంటే మే 20 వరకు వేచి చూడాల్సిందే.