ఆ చిన్న యాడ్ కోసం ఆ రోజుల్లోనే క‌ళ్లు చెదిరే డ‌బ్బు తీసుకున్న ప‌వ‌న్‌… టాలీవుడ్ షేక్‌…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ప్రభంజనం. ఆయన జయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోపక్క వరుస‌ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. పవన్ ఇప్పటివరకు నటించింది తక్కువ సినిమాలు అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ల‌క్ష‌ల్లో అభిమానులు కూడా ఉన్నారు.

Pawan Kalyan & Pepsi

ప‌వర్ స్టార్ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందంటేనే చాలు థియేటర్ల వద్ద ఆయన అభిమానులు హడావుడి మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ పేరుతో థియేటర్లు మోత మోగిపోతాయి. రెండు దశాబ్దాల ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు.

పవన్ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే పవన్ తన కెరీర్ బిగినింగ్ లో పెప్సీ యాడ్లో నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన పెప్సీ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2001లో పెప్సీ బ్రాండ్ సంస్థకు పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఈ యాడ్ చేశారు. సౌత్ ఇండియాలోనే ఓ స్టార్ హీరో యాడ్ చేయటం అదే తొలిసారి.

Pawan, First Brand Ambassador of A Soft Drink! | cinejosh.com

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ యాడ్ లో కూడా నటించారు. పెప్సీ యాడ్‌లో పవన్ నటించినందుకు ఆ సమయంలో గట్టిగానే పారితోషం అందుకున్నారట. ఆ సమయంలో ఈ యాడ్ చేసినందుకు పవన్‌కు రు. 3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు గతంలో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పవన్.

పవన్ కళ్యాణ్ అప్ప‌ట్లోనే ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక హీరో కూడా పవన్ కళ్యాణ్ కావడం మరో విశేషం. దాదాపు 20 సంవత్సరాల కిందటే రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారంటే పవన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికీ అంతకుమించిన క్రేజ్ తో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు.