తెలుగు హీరోలకు వీళ్లు పెద్ద శ‌నిగాళ్లులా మారారా… ఈ ద‌రిద్రం ఏంట్రా బాబు…!

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అపజయాలను ఎదుర్కొంటున్న అక్కినేని ఫ్యామిలీకి మరో ప్లాఫ్ పలకరించింది. నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాతో ఈ అపజయాలకు బ్రేక్ పడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే భారీ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక దీంతో అక్కినేని అభిమానులు సైతం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అక్కినేని ఫ్యామిలీ అపజయాల పరంపరకు ఎప్పుడు బ్రేక్ పడుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Custody Telugu Movie Review - Boredom Arrest!

అదే సమయంలో తమిళ దర్శకులతో తెలుగు హీరోలు చేస్తున్న సినిమాలు వారికి నిరాశ పరుస్తున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే కొందరు తెలుగు హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చేస్తే అక్కడ కూడా తమకి మార్కెట్ పెరుగుతుందని భావించి సినిమాలు చేస్తున్నారు. తీరా అవి విడుదలయ్యాక కోలీవుడ్ మాట పక్కన పెడితే తెలుగులో కూడా భారీ డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి.

గత సంవత్సరం యంగ్ హీరో రామ్ కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామి తో ది వారియర్ మూవీ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక ఇప్పుడు నాగచైతన్య వంతు వచ్చింది. ఇక చైతు గతంలో కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఏం మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో వంటి రెండు సినిమాలను చేశాడు. ఇక ఇప్పుడు మరో తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు తో కస్టడీ సినిమా చేశాడు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలను కూడా పెట్టుకున్నాడు.

The Warriorr (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అంతేకాకుండా ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని.. ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని నమ్మాడు. రామ్ సైతం ది వారియర్ పై అంతే నమ్మకం పెట్టుకున్నాడు. ఈ ఇద్దరు తెలుగు హీరోలకు తమిళ దర్శకులు శనిలా దాపరించిరు. ఇక గతంలో కూడా తమిళ దర్శకులతో తెలుగు హీరోలు చేసిన మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక మరి ఈ నెగటివ్ సెంటిమెంట్ కి భవిష్యత్తులో బ్రేక్ ఎప్పుడు పడుతుందో చూడాలి.