ధూమ్ ధామ్‌గా శ‌ర్వానంద్ – ర‌క్షిత‌రెడ్డి పెళ్లి… డేట్ ఫిక్స్‌.. ఏర్పాట్లు ఇలా…!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల‌లో ఒకరైన శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అంటూ గ‌త నాలుగేళ్లుగా ఒక్క‌టే ర‌చ్చ న‌డుస్తోంది. తాను ప్రేమించిన రక్షిత రెడ్డితో ఈ యేడాది జ‌న‌వ‌రిలో శ‌ర్వా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఎంగేజ్మెంట్ కార్య‌క్ర‌మం చాలా సింపుల్ గా జరిగింది. త‌న‌కు కావాల్సిన‌ సన్నిహితులు కుటుంబ సభ్యులు కొంతమంది సినీ సెలబ్రిటీలు మాత్ర‌మే ఈ వేడుకకు హాజరయ్యారు.

Did Sharwanand and Rakshita Reddy Break their Engagement?

ఎంగేజ్మెంట్ జ‌రిగి నాలుగు నెల‌లు దాటిపోతున్నా ఇంకా పెళ్లి జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల పుకార్లు వ‌చ్చాయి. అస‌లు అఖిల్‌లా శ‌ర్వా కూడా ఎంగేజ్మెంట్‌తోనే బ్రేక‌ప్ చెప్పేస్తాడా ? అని కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేశారు. ఎట్ట‌కేల‌కు ఊరించి ఊరించి శ‌ర్వా పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. రాజస్థాన్ లోని జైపూర్లో రక్షితారెడ్డిని హీరో శర్వానంద్ పెళ్లాడ‌నున్నారు.

Telugu Actor Sharwanand Gets Engaged To Rakshita Reddy, A US-Based Techie -  See Pics

వీరిద్ద‌రి పెళ్లి పత్రికలు కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి. మొత్తం రెండు రోజుల పాటు శ‌ర్వా – ర‌క్షితా రెడ్డి పెళ్లి అత్యంత వైభవంగా జరగబోతుంది. జూన్ 2వ తేదీన మెహందీ వేడుక ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజే పెళ్లి కొడుకు కార్యక్రమం.. ఆ త‌ర్వాత అంటే జూన్ 3వ తేదీన జైపూర్లోని లీలా ప్యాలెస్‌లో రక్షితతో శర్వానంద్ వివాహం జరుగుతుంది. ఈ వివాహ వేడుక రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

Telugu Actor Sharwanand Gets Engaged To Rakshita Reddy, A US-Based Techie -  See Pics

శ‌ర్వా పెళ్లికి ప‌లువురు సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీలు హాజ‌ర‌వుతారు. ఇక ర‌క్షితా రెడ్డి ఏపీలోని శ్రీకాళ‌హ‌స్తికి చెందిన మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి మ‌న‌వ‌రాలు అన్న సంగ‌తి తెలిసిందే. ర‌క్షితా రెడ్డి తండ్రి తెలంగాణ హైకోర్టు న్యాయ‌వాదిగా ఉన్నారు. ఇక శ‌ర్వా ప్ర‌స్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ప్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.