ఎన్టీఆర్ 30కు పాన్ ఇండియా టైటిల్‌… రాజ‌మౌళిని మించిన కొర‌టాల మాస్ట‌ర్ ప్లాన్..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ గ‌తేడాది వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత యేడాదికి పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు త‌న కొత్త సినిమాను ప‌ట్టాలు ఎక్కించాడు. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న ఎన్టీఆర్ 30 వ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది, ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్‌లో మూడవ షెడ్యూల్ కూడా ప్రారంభమైంది.

Fury of #NTR30 - Telugu | NTR | Koratala Siva | Anirudh Ravichander -  YouTube

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. ఈ షెడ్యూల్స్‌లో హీరోయిన్ జాన్వీ క‌పూర్‌తో పాటు మెయిన్ విల‌న్‌గా న‌టిస్తోన్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ఇద్ద‌రూ కూడా పాల్గొన్నారు. ఇక ఈ నెల 20న ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వ‌దిలేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా టైటిల్‌గా దేవరను లాక్ చేశా తెలుస్తోంది. తారక్ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగా మే 19 న అధికారికంగా ప్రకటిస్తారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాను కొర‌టాల పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పాన్ ఇండియా లెవ‌ల్లో టైటిల్ క్లిక్ అయ్యేలా ఒకే టైటిల్ పెడుతున్నారు.

RRR wows international audience, reviews say 'all American films are lame  now' - Hindustan Times

ఐదు భార‌తీయ భాష‌ల్లోనూ ఒకే టైటిల్ ఉంటే సినిమా త్వ‌ర‌గా జ‌నాల్లోకి వెళ్లి బాగా నానుతుంద‌ని.. త్రిబుల్ ఆర్ సినిమా రూల్‌నే ఇప్పుడు త‌న సినిమాకు కూడా ఫాలో అవ్వాల‌ని కొర‌టాల గ‌ట్టి డెసిష‌న్ తీసుకున్నాడ‌ట‌. అందుకే దేవ‌ర అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా వ‌చ్చే వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.