మంచి నిద్ర కోసం వీటికి దూరంగా ఉండాల్సిందే.. లేక‌పోతే తిప్ప‌లు త‌ప్ప‌వు..!

చాలామంది ఫిట్ గా ఉండడానికి డైట్లు.. ఎక్సర్‌సైజ్లు అంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటికోసం కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య నిద్రలేమి. నిద్రలేమి ఇబ్బందుల రాకుండా ఉండడానికి ఆరోగ్యకరమైన పోషకాహారం రాత్రిపూట ఎలా తినాలి ? వర్షాకాలంలో ఫిట్‌నెస్ ఫ్రీగా ఉండాలంటే మీ రాత్రి దిన‌చర్యలో ఎలాంటి ? ఆహారాన్ని తీసుకోవాలి.. ఏ పదార్థాలను రాత్రిపూట తినకూడదు..? అనే అంశంపై డైటీషియ‌న్ల స‌ల‌హాలు చూద్దాం.

చాలామంది జీర్ణవ్యవస్థ‌తో ఇబ్బందులు పడడానికి కారణం ఎక్కువగా చెక్కరలేదా, సుగంధ‌ ద్రవ్యాలు ఉండే పదార్థాలను తీసుకోవడం. గుండెల్లో మంటను పెంచే ఇటువంటి పదార్థాలను వాడడం తగ్గించాలి. వీటితో పాటు టిఫిన్ ఉండే పదార్థాలు అంటే ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, కాఫీ, టీ లాంటి పానీయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్ లు తినడం వల్ల మన శరీరంలో నిద్రకు కారణం అయ్యే హార్మోన్లు చెడు పరిణామాలను ఎదుర్కొంటాయి. కారణంగా నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి.

ఆ రోజు తీసుకున్న ఆహారం వల్ల రెండో రోజు తలనొప్పి, ఎసిడిటీ, నీరసంగా ఉండడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ముందు నిద్ర పట్టినా మధ్యలో మెలకువ వస్తుంది. దాని వల్ల శరీరంలో డిహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. తరచుగా దాహం వేయడం నోరు పొడిగా మారడం జరుగుతుంది. కాబట్టి రాత్రిళ్ళు పడుకునే ముందు ఆల్కహాల్, కేఫిన్‌, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

చక్కెరలాంటి పదార్థాలను అసలు తీసుకోకూడదు దీని కారణంగా శరీరంలో గ్లూకోస్ లెవెల్స్ పెరిగి శక్తి పెరుగుతుంది.. దీని కారణంగా త్వరగా నిద్ర పట్టదు. అందుకే నిద్రపోయే ముందు చక్కెర‌ పదార్థాలకు దూరంగా ఉండాలి. పడుకునే ముందు వేడి పాలు తాగాలి. నిద్ర ప‌టాలంటే పాల‌తో యాలుకలు, జాజికాయ కలిపి తీసుకోవాలి. దీనివ‌ల్ల‌ నిద్ర చక్కగా పడుతుంది. నిద్రపోయే ముందు బాదం, పసుపు, కుంకుమపువ్వు లాంటి ఆహారాం తీసుకోవడం వల్ల నిద్రలేమి ఇబ్బందులు ఉండవు. మంచి నిద్ర వల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.